కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి కోర్టు ఆయనకు జ్యూడీషియల్ కస్టడీ విధించిన విషయం తెల్సిందే.కస్టడీ సమయంలో తీహార్ జైల్లో చిదంబరం ఉన్నాడు.
తాజాగా కస్టడీ ముగియడంతో చిదంబరంను బయటకు పంపించే అవకాశం ఉందని అంతా భావించారు.కాని అనూహ్యంగా ప్రత్యేక కోర్టు చిదంబరం కస్టడీని కొనసాగిస్తూ మళ్లీ తీర్పు ఇచ్చింది.
అక్టోబర్ 3 వరకు ఈ కస్టడీ కొనసాగబోతుంది.మరో రెండు వారాల పాటు చిదంబరం తీహార్ జైల్లోనే గడపబోతున్నాడు.
గతంలో కేంద్రంలో నె.2 అంటూ వెలుగు వెలిగిన చిదంబరం ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ నాయకులు గుండెలు పలిగి పోతున్నాయి.కేవలం 300 కోట్ల రూపాయల కేసులో ఇంతటి తీవ్ర విచారణ ఏంటీ అంటూ వారిలో వారు చర్చించుకుంటున్నారు.ఈ పరిస్థితి ఇతర కాంగ్రెస్ నాయకులకు కూడా వచ్చేనా అంటూ భయపడుతున్నారు.
హోం మంత్రి అమిత్ షా కక్ష పూరితంగా చిదంబరంను వేదిస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కాని ఇప్పటి అమిత్‌షా మాత్రం ఈ విషయమై పెద్దగా స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు.