తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు మీద పీకల్లోతు కోపం పెంచుకున్న బీజేపీ ఎట్టకేకలకు మళ్ళీ అధికారం లోకి వచ్చేసింది.ఆ పార్టీ కూడా ఊహించని స్థాయిలో సీట్లు రావడం తో తమకు అడ్డేలేదు అన్నట్టుగా దూకుడుగా ముందుకు వెళ్తోంది.
ముఖ్యంగా ఏపీలో బలపడాలని చూస్తున్న ఆ పార్టీ టీడీపీ నుంచి వలసలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది.ఇప్పటికే కొంతమంది కీలక నాయకులు పార్టీలో చేరిపోగా మిగిలి ఉన్న నాయకులను తమ పార్టీలో చేర్చుకొనేందుకు పావులు కదుపుతోంది.
అయితే ఇవన్నీ కొద్దిరోజులుగా యధావిధిగా జరిగిపోతున్నా త్వరలో బాబు అరెస్ట్ అవ్వడం తప్పదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.బాబుని అరెస్ట్ చెయ్యడానికి తెర వెనకాల ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు తెలుస్తోంది.
గతంలో బాబు మెడకు చుట్టుకున్న ఓటుకు నోటు సహా ఇతర అవినీతి కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అన్నిఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.ఈ మేరకు ఔట్ లుక్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ లాంటి పత్రికలు కూడా దీనికి సంబంధించి కథనాలను కూడా ప్రచురించాయి.అంతేకాకుండా బాబు అరెస్ట్ అవ్వడం తప్పదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ ఏపీ ఇన్ చార్జి సునీల్ దేవధర్ కూడా ప్రకటించారు.గతంలో బాబు, కాంగ్రెస్ కలసి జగన్ మీద అక్రమాస్తుల కేసులు పెట్టి ఆయన్ను జైలుకు పంపిన సంగతి అందరికి తెలిసిందే.
ఇప్పుడు జగన్ కూడా బాబును జైల్లో వేయించేందుకు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక చంద్రబాబు వారసుడు లోకేష్ ట్విట్టర్‌లో తప్ప బయట ఎక్కడా కనిపించకపోవడంతో పార్టీ నేతలు అందురూ అభద్రతా భావంతో ఉన్నట్టు అర్ధం అవుతోంది.అయితే ప్రస్తుతం ఏపీ బీజేపీ సహ ఇన్ చార్జి సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి.చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధమని గ్రహించిన ’18మంది టీడీపీ ఎమ్మెల్యేలు మమ్మల్ని సంప్రదిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే టీడీపీకీ చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు.అదే విధంగా టీడీపీ ఎమ్యెల్యేలను కూడా చేర్చుకుని టీడీపీకి ఏపీలో ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలని బీజేపీ ప్లాన్ వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.