కేంద్ర అధికార పార్టీ బీజేపీ – ఏపీ అధికార పార్టీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఆగేలా కనిపించడంలేదు.టీడీపీ ఆర్థిక మూలలను దెబ్బకొట్టి మరోసారి అధికారంలోకి రాకుండా చూడాలని బీజేపీ చూస్తోంది.
దానిలో భాగంగానే గత కొంత కాలంగా టీడీపీకి ఆర్ధిక అండదండలు అందిస్తున్న ఆ పార్టీ నాయకులపై బీజేపీ గురిపెట్టి ఐటీ, ఈడీ శాఖలతో వారి ఆస్తులపై లెక్కలు చెప్పాలంటూ …హడావుడి చేస్తోంది.
ఈ కోవలోనే … సీఎం రమేష్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది బీజేపీ.ఆ పార్టీకి చెందిన జివిఎల్ నరసింహ రావు టీడీపీ నేతలే టార్గెట్ గా మాటల దాడి చేస్తున్నారు.ఇరు పార్టీల నేతల సవాళ్ళు ప్రతి సవాళ్ళతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది.
ఏపీలో ఐటి రైడ్స్ మొదలైన దగ్గరనుంచి వీరినడుమ మొదలైన మాటల యుద్ధం రోడ్ ఎక్కి ఛానెల్స్ కి రేటింగ్స్ పెంచే స్థాయికి వెళ్ళింది.తాజాగా జివిఎల్ చేసిన ఆరోపణలు విమర్శలతో ప్రతి దాడి చేశారు రమేష్.
దాంతో వీరి నడుమ వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు.
టిడిపి ఆర్ధిక అవినీతి మూలాలన్నీ సిఎం రమేష్, సుజనా చౌదరి, నారాయణ వంటివారి దగ్గరే వున్నాయన్న బలమైన ఆధారాలు సేకరించింది బిజెపి.వచ్చే ఎన్నికల్లో ఏపీలో నిలవాలంటే తాము మద్దతు ఇచ్చేవారు గెలవాలన్న టీడీపీ ఆర్ధిక మూలాలు నాశనం చేయడంబీజేపీ యుద్ధ వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది.నేరుగా చంద్రబాబు ను లోకేష్ ను టార్గెట్ చేయకుండా వారి బినామీలుగా ఆరోపణలు వున్న వారిపై దాడులు మొదలు పెట్టింది.
తమపై కేంద్ర ప్రభుత్వం కావాలనే కేంద్రం బురద జల్లుతుందనే ఆరోపణలు సంధించారు సీఎం రమేష్.ఆయనకు మద్దతుగా టిడిపి నేత ఎమ్యెల్సీ బుద్దా వెంకన్న కూడా రంగంలోకి దిగిపోయారు.
ఆయన జివిఎల్ పై నేరుగా ఆరోపణలు మొదలు పెట్టేశారు.ఈ యుద్ధ వాతావరణం ఇప్పట్లో ఆగేలా కనిపిన్చటం లేదు.
ఎన్నికల వరకు ఇదే తంతు కొనసాగేలా కనిపిస్తోంది.