వేల సంఖ్యలో భారతీయులకి అమెరికా పౌరసత్వం..!

అమెరికాలో గడిచిన ఎడాది ఎన్నారైలకి ఇచ్చిన అమెరికా పౌరసత్వం లెక్కల్ని హోంలాండ్ సెక్యూరిటీ బహిర్గతం చేసింది.2017 సంవత్సరంలో సుమారు 50,802 మంది భారతీయులుకు తమ పౌరసత్వాన్ని పొందారని హోంలాండ్ సెక్యూరిటీ అధికారికంగా ధృవీకరించింది.అయితే ఈ సంఖ్యని 2016 సంవత్సరంతో పోల్చితే నాలుగువేల మంది ఎక్కువగా పౌరసత్వాన్ని పొందారని తెలిపింది.

 Indian Nris Que Line In America For Permanent Visa-TeluguStop.com

ఇక వలసలపై హోంలాండ్ సెక్యూరిటీ విభాగం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం చూస్తే 2016 సంవత్సరం లో 46,188 మంది.2015 సంవత్సరం లో సుమారు 42,213 మంది భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందారు.అయితే 2017లో 7,07,265 మంది విదేశీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందగా.

అందులో 50,802 మంది భారతీయులు ఉన్నారు.

2016 సంవత్సరం లో 7,53,060 మంది, 2015 సంవత్సరం లో 7,30,259 మంది విదేశీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందారు.2017సంవత్సరం లో ఎక్కువగా 1,18,559 మంది మెక్సికన్ పౌరులకు అమెరికా పౌరసత్వం లభించింది…అయితే ఈ లెక్కల్ని అధికారికంగా ద్రువీకరించామని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube