ప్రభుత్వాలు ,పోలీసులు మహిళల రక్షణకై ఎన్ని చర్యలు చేపడుతున్నా సరే మృగాళ్ళకి మానవత్వం.మంచితనం లేనప్పుడు పశువులాగానే ప్రవర్తిస్తూ ఉంటాడు.
ఒంటరిగా ఉన్న మహిళళ పట్ల అత్యనత పాశవికంగా ప్రవర్తించడం వంటి దారుణాలకి ఒడిగాడుతారు.తప్పు ఎవరిదీ సమాజానిదా.? లేక విచ్చలవిడి శృంగారం ఒలకపోస్తున్న మధ్యమాలదా.లేక తల్లి తండ్రులదా అంటూ సంఘటన జరిగిన ప్రతీ సారి బేరీజు వేసుకోవడం సరిపోతోంది.
ఎన్నో అఘాయిత్యాలు జరిగిపోతూ ఉంటాయి.వివరాలలోకి వెళ్తే.
![](https://TeluguStop.com/wp-content/uploads/2018/06/4-mens-gang-rape-on-marriedwomen.jpg)
తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది.ఓ నలుగురు కామాంధులు ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యంత పాశవికంగా ప్రవర్తించారు.ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ సంఘటన కల్వకుర్తి లో కలలలం సృష్టించింది.మహిళలు ఒంటరిగా వెళ్ళాలంటేనే భయపడిపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని నిర్మానుష్య ప్రాంతంలో అర్థరాత్రి సమయంలో ఈ ఘోరం జరిగింది.వివాహితను ఒంటరిగా గుర్తించిన నలుగురు యువకులు బలవంతంగా ఆమెను ఆ ఆ స్కూల్ ప్రాంగణానికి తీసుకువచ్చారు.
అక్కడ జనసంచారమేమీ లేకపోవడంతో నలుగురు కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్నడ్డారు.అతి కష్టం మీద వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు అప్పుడే తన మొబైల్ నుండి 100కు ఫిర్యాదు చేసింది.
దాంతో వెంటనే స్పందించిన పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు.అయితే ఈ ఘటనని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ , కలెక్టర్ శ్రీధర్ లు స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఈ కేసుకు సంభందించిన నలుగురు వ్యక్తులని అరెస్ట్ చేశారు.వారిని కోర్టుకి తరలించి శిక్ష పడేలా చేసి భాదితురాలికి న్యాయం చేస్తామని తెలిపారు.