ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న పాదయత్ర మైలేజ్ తగ్గించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు వైసీపీ నేతల్ని టిడిపిలోకి ఆకర్షించడం దగ్గర నుంచీ వారితో జగన్ మీద బురద జల్లించే ప్రయత్నం వరకూ అన్నీ చేసుకుంటూ వచ్చారు.జగన్ పాదయాత్ర ఎక్కడ చేస్తున్నా సరే ఆ ప్రాంతంలో ఉన్న వైసీపి నేతల్ని సైకిల్ ఎక్కించుకుని చెక్ పెడుతూ వచ్చారు.
అయితే జగన్ జోరుని తగ్గించడానికి చంద్రబాబు “జన్మభూమి –మన ఊరు” ప్రారంభించారు.జగన్ పాదయాత్ర చంద్రబాబు సొంత జిల్లాలో జరగడంతో.
చంద్రబాబు కూడా జగన్ సొంత జిల్లాలో సభ పెట్టి చక్రం తిప్పాలని అనుకున్నారు.అయితే ఆ సభలో చంద్రబాబు కి ఊహించని షాక్ ఎదురయ్యింది.
కడప జిల్లా అందులోనూ పులివెందుల అంటే వేరేగా చెప్పక్కర్లేదు జగన్ కంచు కోట అక్కడ కి వెళ్లి ఎదో చేద్దాం అనుకున్న చంద్రబాబుకి ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు.
చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమం ప్రభుత్వ కాబట్టి.
టిడిపి నేతలతో పాటు వైసిపి ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది.
చంద్రబాబు సమక్షంలోనే కడప ఎంపి అవినాష్ రెడ్డి వేదికపై నుండి దివంగత వైఎస్ఆర్ జిల్లాకు చేసిన సేవలను పొగడటం ప్రారంభించారు.ఒక్క సారిగా షాక్ తిన్న చంద్రబాబు ఏయ్ తమ్ముడు ఏమి మాట్లాడుతున్నావ్ ఇది మిమ్మల్ని పొగడటానికి పెట్టిన సభ కాదు అంటూ అవినాష్ ప్రసంగానికి అడ్డు తగిలారు.
అవేమీ పట్టించుకోని అవినాష్ రెడ్డి.వైఎస్సార్ పేరు అనగానే ఒక్కసారిగా సభలో ఉన్నవాళ్ళు అందరు జోహార్ వైఎస్సార్ అంటూ సభ మారు మొగేలా అరిచారు.గండికోట ప్రాజెక్టు నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు రూ.1,300 కోట్లతో ఎత్తిపోతల పథకాలకు ఒక రూపాన్ని ఇచ్చింది దివంగత వైఎస్సార్.అయితే ఆయన హయాంలోనే దాదాపు రూ.1,100 కోట్లు ఖర్చు చేశారని ఎంపీ అవినాష్‌రెడ్డి చెప్పగానే ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.దాంతో అవినాష్ మాట్లాడకుండా మైక్ కనెక్షన్ కట్ చేశారు.
సభలో వైఎస్సార్ పేరు చెప్పడంతో పసుపు రంగు వేసుకున్న కార్యకర్తలు సైతం లేచి చప్పట్లు కొట్టడంతో బాబు షాక్ అయ్యారు.
ఇది వైసీపి సభలా జరుగుతోంది అని భావించిన బాబు అవినాష్ ని వేదికపై నుంచీ దింపేశారు…దాంతో వేదికపైనే కాసేపు గందరగోళం రేగింది.తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాలు తగవన్నారు.
రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు.ఈ పరిణామాలతో ఒక్కసారిగా సభలో ఉన్న కడప టిడిపి నాయకులు మంత్రులు ఖంగారు పడిపోయారు.