ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ మేరకు టీడీపీ కీలక నేతలతో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి( Magunta Sreenivasulu Reddy ) సమావేశం కానున్నారని తెలుస్తోంది.
వైసీపీ ద్వారాలు అన్నీ మూసివేయడంతో మాగుంట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయన టీడీపీ( TDP ) నేతలతో సమావేశం కాబోతున్నారనే చర్చ జోరుగా సాగుతుంది.టీడీపీతో చర్చలు సఫలం అయితే ఒంగోలు లోక్ సభ స్థానాన్ని అడిగే అవకావం ఉందని సమాచారం.ఒంగోలు నియోజకవర్గం నుంచి తన కుమారుడు రాఘవరెడ్డిని బరిలో దింపాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఢిల్లీ( Delhi )లో ఉన్న మాగుంట రాష్ట్రానికి రాగానే టీడీపీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.