ప్రముఖ డ్యాన్సర్ మంజు భార్గవి( Manju Bhargavi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కూచిపూడి మాస్టర్ వెంపటి చినసత్యం ఆమెకు నాట్యంలో ఓనమాలు దిద్దించారు.
ఒక సమయం దాకా ఆమెను నాట్యకారిణి గానే ప్రజలు చూశారు కానీ ఆమెలో ఒక గొప్ప నటి ఉందని దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్( K Vishwanath ) చూడగలిగాడు.తాను తీసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శంకరాభరణం’లో ( Sankarabharanam ) ఆమెను హీరోయిన్ గా విశ్వనాథ్ తీసుకున్నాడు.తులసి పాత్ర మంజు భార్గవి యాక్టింగ్ కెరీర్‌లో బెస్ట్ గా నిలిచింది.
ఆ పాత్ర వల్లే ఆమె గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు తెలుసొచ్చింది.అంతకుముందు ఆమె చిన్నపాటి పాత్రలు చేస్తూ గుర్తింపు లేకుండానే సినిమా ఇండస్ట్రీలో పనిచేసింది.
ఒకానొక సమయంలో తాను చాలా పిచ్చి వేషాలు వేశానని ఆమెనే ఒప్పుకుంది.
అలాంటి చెత్త పాత్రలు వేసిన మంజు భార్గవినే విశ్వనాథ్ తన శంకరాభరణం సినిమాలో హీరోయిన్ గా ఎందుకు ఎంచుకున్నాడని చాలామంది ప్రేక్షకులు ఇప్పటికీ అడుగుతుంటారు.మరి దానికి సమాధానం ఏంటో తెలుసుకుందాం.ఒకానొక సమయంలో చెన్నైలో ప్రొడ్యూసర్స్ గిల్డ్( Producers Guild ) వారు ఒక ఫంక్షన్ కండక్ట్ చేశారు.
ఆ ఫంక్షన్‌కు గీత, మంజుభార్గవి వంటి నటీమణులు కూడా హాజరయ్యారు.అయితే నిర్మాతలు ఫంక్షన్ ఎంట్రన్స్ ముందు నిలుచుని అతిథులపై పన్నీరు చల్లి, పూలు అందించమని మంజు భార్గవి తో పాటు మరో ఇద్దరు నటీమణులను కోరారు.
దాంతో మంజు భార్గవి పన్నీరు చల్లడం మొదలుపెట్టింది.
అదే సమయంలో ఆ ఫంక్షన్‌కు అతిథిగా కె.విశ్వనాథ్ ( K Vishwanath ) కూడా వచ్చాడు.ఆ సమయంలోనే తొలిసారిగా మంజు భార్గవిని విశ్వనాథ్ చూశాడు.
అప్పుడే తన శంకరాభరణం సినిమా హీరోయిన్ కి మంజు భార్గవి సరిగ్గా సూట్ అవుతుందని అతనికి అనిపించింది.అలాగని వెంటనే ఆమెకు హీరోయిన్ రోల్ ఇచ్చేద్దామని అనుకోలేదు.
ఒకసారి ఆమె యాక్టింగ్ స్కిల్స్, లుక్ టెస్ట్ చేద్దామనుకున్నాడు.ఆ ప్రయత్నంలో భాగంగా తన “ప్రెసిడెంట్ పేరమ్మ”( President Peramma ) సినిమాలో ఒక రోల్ ఇచ్చాడు.
ఆ పాత్రలో భాగంగా ఆమె మేకప్, కాస్ట్యూమ్స్, ఆభరణాలు ధరించాలని, అలాగే కొన్ని సన్నివేషాలలో నటించాలని చెప్పాడు.అందుకు మంజు భార్గవి ఓకే చెప్పి ఆ మూవీలో నటించింది.
ఆమె లుక్కు, నటన విశ్వనాథ్ కి నచ్చాయి.తర్వాత ఒక ఫోటో ఇచ్చి వెళ్ళమని ఆమెకు చెప్పి పంపించేసాడు.
కొద్దిరోజుల తర్వాత మంజు భార్గవికి మేకప్ టెస్ట్ చేయించి శంకరాభరణం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పాడు.దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఈ పాత్ర తర్వాత ఆమెకు ఎంతో గుర్తింపు వచ్చింది.అంత మంచి రోల్ చేశాక మళ్ళీ పిచ్చి వేషాలు చేయడానికి ఆమె అస్సలు ఇష్టపడలేదు.అందుకేనేమో ఆమె ఈ సినిమా తర్వాత పెద్దగా నటించలేదు.ఎక్కువగా డాన్స్ ప్రోగ్రామ్స్ పైనే దృష్టి సారించింది.
ఆ విధంగా విశ్వనాథ్ ఆమెను సెలెక్ట్ చేశాడు.ఇలా హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకోవడం ఆ లెజెండరీ డైరెక్టర్ కి ఒక్కరికే చెల్లిందని చెప్పుకోవచ్చు.