చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.చేపలు పేరు చెబితే చాలు ఎవరికయినా సరే నోరు ఊరిపోతుంది.
అయితే చేపలలో ఈల్ చేపలు చాలా ప్రత్యేకమైనవిగా చెప్పాలి.ఎందుకంటే మనకు దొరికే చేపలు మహా అయితే కిలో రూ 120-150 దాక ధర పలుకుతాయి.అలాగే కొర్రమీను చేపలు అయితే రూ.800 వరకు ధర పలుకుతాయి.చేప యొక్క రకాన్ని బట్టి ధర ఉంటుంది.కానీ ఉనాగి ఈల్ చేపలు మాత్రం అలా కాదు.
వాటిని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవలిసిందే.ఎందుకంటే వాటి ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ.
వీటి ధర లక్షల్లో ఉంటుంది.జపాన్‌లో పెరిగే జపనీస్ ఈల్ చేపలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపలుగా పేరు గాంచినవి.
ఈ చేపలు జపాన్‌తో పాటు పశ్చిమ ఆసియా దేశాల తీరాల్లో మాత్రమే లభ్యం అవుతాయి.ఈ ఈల్ చేపలు మాత్రం భారీ ధరలో అమ్ముడుపోతాయి.
ఈ చేపలు ఎక్కడ లభిస్తాయి అంటే:
జపాన్ లోని మంచినీటిలో ఉనాగీ ఈల్ చేపలు లభిస్తాయి.ఉనాగీ జాతికి చెందిన ఈల్ చేపలు బంగారంతో సమానంగా భావిస్తారు.2021 సంవత్సరంలో యంగ్ ఈల్స్ రకం చేప కిలోకు 35,000 డాలర్లు పలికింది.అంటే ఇప్పడు మన కరెన్సీలో రూ.26 లక్షలపైనే. ఈ చేపలు ఇంత రేటు పలకడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి.
అవేంటంటే ఒకటి చేపలు సంఖ్య తగ్గడం అలాగే ఈ చేపలను పెంచటానికి ఎక్కువ సమయం పట్టడం వలన వీటికి అంత ధర పలుకుతుంది.ఈ చేపల పెంపకం అంత ఈజీ కాదండోయ్.
వీటి పెంపకం ఎలా అంటే:
ఎందుకంటే సాధారణ చేపలతో పోల్చితే వీటి పెంపకం.కాస్త భిన్నంగా ఉంటుంది.
ఈ చేపలు ఎదగడానికి 6 నెలల నుంచి 12 నెలల సమయం దాక పడుతుంది.అలాగే ఒక ఏడాది పాటు వీటిని పెంచాలంటే భారీగా ఖర్చువుతుంది.
ఈ చేపలకు ఆహారంగా పశుగ్రాసం, గోధుమలు, సోయాబీన్, చేపనూనె వంటివి రోజుకు మూడు సార్లు ఆహారంగా వేయాలి.
ఇంకో ముఖమైన విషయం ఏంటంటే.ఈ చేపలలో ఒక్క చేపకు ఏదైనా వ్యాధి వస్తే అందులో ఉన్న మిగతా చేపలన్నీ కూడా ఆ వ్యాధి బారినపడతాయి.అలాగే ఈ చేపలతో చేసిన వంటకాలను జపాన్‌లో కబయాకి అని పిలుస్తారు.
కానీ ఈల్ వంటకాలను తయారు చేయడం అంత తేలికైన విషయం కాదు.ఉనాగీ ఈల్ చేపల వంటకాలను నేర్చుకునేందుకు కనీసం ఏళ్ల సమయం పడుతుంది.
ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారు మాత్రమే ఈ చేపలను కత్తిరించగలరు.అలాగే ఈ చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
అందువల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది.