వైరల్: షూటింగ్ స్పాట్ లోనే బిడ్డ కోసం ఆ హీరోయిన్ ఏకంగా..?

సినిమాల్లో నటించడం అంటే మాములు విషయం కాదు.ముఖ్యంగా మహిళలు ఒకపక్క ఇంటిని, పిల్లలను చూసుకుంటూ మరోపక్క షూటింగ్ లలో పాల్గొనాలి.

 Wonder Woman Gal Gadot Pumps Breast Milk While In The Shooting Sets , Viral Late-TeluguStop.com

ఒక్కోసారి ఎక్కువ సమయం షూటింగ్ స్పాట్ లోనే గడపవలిసి వస్తుంది.ఇంట్లో పిల్లలతో ఉండే సమయం చాలా తక్కువగా ఉంటుంది.

పిల్లలు పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు కానీ.మరి పాలు తాగే పసిపిల్లలు అయితే చాలా కష్టం కదా.ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా తన తల్లి పాత్ర తాను పోషించింది ఈ హీరోయిన్.

షూటింగ్ హడావుడిలో ఉన్నాగాని బిడ్డ ఆకలి గుర్తించి తన బిడ్డకు పాలు ఇచ్చి తన తల్లి మనసును చాటుకుంది.బిడ్డకు తల్లిపాల కంటే శ్రేష్ఠ మైనవి ఏవి లేవు.

ఈ వయసులోనే పిలల్లకు తల్లిపాలు తాగిస్తే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు.వాళ్లలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

సరే ఈ విషయాలను పక్కన పెడితే., అసలు ఇంతకి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

హాలీవుడ్ సినిమా వండర్‌ వుమెన్‌ లో నటించిన హీరోయిన్‌ గాల్‌ గాడోట్‌ గురించి అందరికి తెలిసిందే.ఈ మధ్యనే ఈవిడ తన మూడవ బిడ్డను ప్రసవించింది ఈ హాలీవుడ్ భామ.ఒక హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఒక తల్లిగా కూడా బాధ్యతను నెరవేరుస్తున్నారు గాల్ గాడోట్.బిడ్డను ప్రసవించిన నెలల సమయంలోనే ఓ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు గాల్ గాడోట్.

అలా షూటింగ్ లో పాల్గొనే క్రమంలోనే బిడ్డకి పాలు ఇచ్చింది.గాల్ గాడోట్ మేకప్ వేసుకునే టైమ్ లో తన బిడ్డకు పాలిస్తూ ఉన్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.

అలాగే ఫొటోతో పాటు “తెర వెనుక నేను అమ్మగా నా బాధ్యత” అని కామెంట్ కూడా పెట్టింది.

Telugu Breast Milk, Milk, Sets, Spot, Latest, Gal Gadot-Latest News - Telugu

ఇలా షూటింగ్ సమయంలో తమ పిల్లలకు పాలు ఇచ్చే హీరోయిన్స్ ను మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము కదా.ప్రస్తుతం గాల్ కు సంబందించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఎంతో మంది అభిమానులు గాల్ ను మెచ్చుకుంటూ తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.

ఒక పక్క వృత్తికి న్యాయం చేస్తూ మరో పక్క అమ్మా అనే పదానికి కూడా న్యాయం చేస్తుంది.గ్రేట్ మదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకా సినిమాల విషయానికి వస్తే కెన్నెత్‌ బ్రనగ్‌ దర్శకత్వం వహిస్తున్న బ్రిటీష్‌ అమెరికన్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘డెత్‌ ఆన్‌ ద నైల్‌‘ అనే సినిమా చేస్తోంది.ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

అలాగే రెడ్ నోటీస్, ద ఫ్లాష్ అనే మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube