ఎర్రటి మెరిసే పెదాలు( Lips ) అందాన్ని మరింత పెంచుతాయి.అందుకే అలాంటి గ్లోయింగ్ రెడ్ లిప్స్ కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.
ముఖ్యంగా మగువలు అటువంటి పెదాలు పొందడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.కానీ ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, రసాయనాలు అధికంగా ఉండే లిప్ స్టిక్స్ ను వాడటం, శరీరంలో అధిక వేడి తదితర కారణాల వల్ల లిప్స్ డార్క్( Dark Lips Tips ) గా మారుతుంటాయి.
నల్లటి పెదాలు అందాన్ని పాడుచేస్తాయి.అందుకే పెదాల నలుపును వదిలించుకునేందుకు ఏం చేయాలో తెలీక సతమతం అవుతుంటారు.
అయితే వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను పాటిస్తే మీ పెదాలు ఎర్రగా మెరవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ షియా బటర్( Shea Butter ) వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు బ్రౌన్ షుగర్ మరియు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.
అనంతరం వేళ్ళతో సున్నితంగా పెదాలను స్క్రబ్బింగ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే పెదాల నలుపు వదిలిపోయి ఎర్రగా మారుతాయి.
అలాగే కాఫీ పౌడర్( Coffee Powder ) తోనే పెదాల నలుపును పోగొట్టుకోవచ్చు.అందుకోసం ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి.అనంతరం లిప్స్ ను స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసిన కూడా పెదాల నలుపును వదిలించుకోవచ్చు.
ఇక డార్క్ లిప్స్ నుంచి బయటపడటానికి మరొక అద్భుతమైన టిప్ ఉంది.అందుకోసం ఒక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ హనీ మరియు నాలుగు చుక్కలు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని నైట్ నిద్రించే ముందు పెదాలకు ఒకటి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్ గా చేసిన సరే పెదాలు నలుపు వదిలి పోతుంది.కొద్ది రోజుల్లోనే లిప్స్ ఎర్రగా కాంతివంతంగా మెరుస్తాయి.