శరీరంలో అన్ని అవయవాలు బాగానే ఉన్నా సక్సెస్ కాలేక ఎంతోమంది కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు.అయితే ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా ఒక యువతి మాత్రం సివిల్ ర్యాంకర్( Civils Ranker ) స్థాయికి ఎదగడం గమనార్హం.
యూపీఎస్సీ సివిల్ ర్యాంకర్ షెరీన్ షహానా( Sherin Shahana ) కథ వింటే ఒకింత ఆశ్చర్యానికి గురి కాక తప్పదు.ఆమె కెరీర్ పరంగా ఎదిగిన తీరు ఎంతోమందికి స్పూర్తిదాయకమని చెప్పవచ్చు.
కేరళ రాష్టంలోని( Kerala ) వయనాడ్ కు చెందిన షెరీన్ షహానా ఒకరోజు ప్రమాదశాత్తూ టెర్రస్ పై నుంచి కింద పడ్డారు.వెన్నెముకకు గాయాలు కావడంతో పాటు పక్కటెముకలు విరగడంతో ఆమె చేతులు, కాళ్లు చచ్చుబడిపోయాయి.
సాధారణంగా అకస్మాత్తుగా ఎవరికైనా ఇలాంటి శారీరక లోపాలు ఎదురైతే కెరీర్ గురించి అస్సలు ఆలోచించరు.అయితే షెరిన్ మాత్రం పట్టుదలతో కెరీర్ పై ఫోకస్ పెట్టి సివిల్స్ పై దృష్టి పెట్టారు.
యూపీఎస్సీ సివిల్ ర్యాంక్ సాధించిన ఈ యువతి మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం తర్వాత నా జీవితం మళ్లీ మొదలైందని రెండేళ్లు మంచానికే పరిమితం అయినా శరీరంలోని లోపాలను అధిగమించాలని భావించానని నాకు ఏవి సాధ్యమవుతాయో ఏవి సాధ్యం కావో విభజించుకుని ముందుకు సాగానని ఆమె చెప్పుకొచ్చారు.ఇవే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని ఆమె తెలిపారు.
జాతీయ స్థాయిలో నాకు 913వ ర్యాంక్ వచ్చిందని ఒకవైపు పిల్లలకు చదువు చెబుతూనే మరోవైపు సివిల్స్ రాశానని షెరీన్ షెహానా అన్నారు.శారీరక లోపం వల్ల పేజీలు తిప్పలేని పరిస్థితి ఉన్నా మరొకరి సహాయంతో నేను పరీక్ష రాశానని ఆమె చెప్పుకొచ్చారు.అంగవైకల్యం శరీరానికే కానీ లక్ష్యానికి కాదని షెరీన్ చెప్పుకొచ్చారు.షెరీన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.షెరీనా షహాన్ సక్సెస్ స్టోరీ విని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.