రామ్ చరణ్ సినీ కెరీర్ లో రంగస్థలం ఎప్పుడు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.రామ్ చరణ్( Ram charan ) ఆ సినిమాలోనే విశ్వరూపం చూపించాడు.
రంగస్థలం తరువాత రామ్ చరణ్ చేసిన సినిమా వినయ విధేయ రామ.రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి.కానీ వినయ విధేయ రామ ( Vinaya Vidheya Rama )మాత్రం బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టింది.
కానీ ఈ సినిమాలో మాత్రం బోయపాటి శ్రీను మాత్రం ఒక పిల్లోడిని పట్టుకొచ్చాడు.ఆ బుడ్డోడి క్యారెక్టర్ ని అంత త్వరగా మరచిపోలేము.ముఖ్యంగా ఆ బుడ్డోడి డైలాగ్ అన్నయ్యలు చదువుకుంటారు నేను పని చేస్తాను అనే డైలాగ్ సినిమాలో భలే ఉంటుంది.
సినిమా ప్లాప్ అయినా ఆ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన బుడ్డోడు మాత్రం ఫేమస్ అయిపోయాడు.అయితే ఆ బుడ్డోడు ఎవరో కాదంట.బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కజిన్ కొడుకు.అతని పేరు రోషన్ రాయ్.
రోషన్ రాయ్( Roshan Roy ) కి కెమెరా ముందు కనిపించాలనే ఆత్రుత ఉండేదంట.దీంతో ఆ కుర్రాడి సెలవు దినాలలో వినయ విధేయ రామ సినిమాలో నటించాడు.ఈ సినిమా ప్లాప్ అయినా రోషన్ రాయ్ కి మాత్రం వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయంట.తాజగా రోషన్ రాయ్ జీ తెలుగు లో ‘కల్యాణ వైభోగమే అనే సీరియల్( Kalyana Vaibhogam Serial ) లో ‘చారుకేశి’ అనే పాత్ర చేసాడు.
ఆ పాత్రకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.ఈ సీరియల్ లోనే కాదు టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు.అయితే ఈ కుర్రాడు, బోయపాటి శ్రీను కి బంధువు అవుతాడనే విషయం ఇండస్ట్రీలో ఇప్పటికి చాలా మందికి తెలీదు.అయితే ఈ కుర్రాడికి మరిన్ని మంచి ఛాన్స్ లు అయితే వస్తాయి అని నెటిజెలు కామెంట్లు పెడుతున్నారు.
చాలా మీమ్స్ లో ఈ కుర్రాడిని వాడుకుంటున్నారు.