Shimbu : ఇంతమంది దర్శకుల కెరీర్ పోగొట్టింది హీరో శింబునా ?

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలో అడుగుపెట్టి ఆపై హీరోగా అవతరించి ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు శింబు.2004లో మన్మధన్‌ ( Manmadhan ) సినిమాతో శింబు కోలీవుడ్లే మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరో అయిపోయాడు.ఏ.జె.మురుగన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ తర్వాత శింబు, మురుగన్ ఇద్దరూ కలిసి మూడేళ్ల పాటు చాలా క్లోజ్‌గా మెసిలారు.

 Shmibu Spoiled Directors Career-TeluguStop.com

అనంతరం శింబు ఒక్కసారిగా అతడి నుంచి విడిపోయి తన దారి తాను చూసుకున్నాడు.జోక్ ఏంటంటే మన్మధన్‌ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే ఏ.జె.మురుగన్ అందించాడు.కానీ శింబు కోరడంతో ఆ క్రెడిట్ అతనికే ఇచ్చాడు.స్టోరీకి క్రెడిట్ ఇస్తే తాను డబ్బులు ఇస్తానని, భవిష్యత్తులో చాలా సినిమా అవకాశాలు కూడా ఇస్తానని శింబు మాటిచ్చాడు.

కానీ ఆ మాట తప్పాడు.తర్వాత అతన్ని దారుణంగా మోసం చేశాడు.

Telugu Aj Murugan, Kollywood, Manmadhan, Nandhu, Shimbu, Tamil Directors, Tollyw

ఈ దెబ్బకు ఏ.జె.మురుగన్( A.J.Murugan ) 14 ఏళ్ల పాటు ఒక్క సినిమా అవకాశం కూడా లేక అల్లాడిపోయాడు.ఒక ఇంటర్వ్యూలో శింబు అంత మోసగాడు మరెవరు లేడు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఈ డైరెక్టర్‌ని ఒక్కడినే కాదు చాలామందిని మోసం చేశాడు.ఎందుకంటే శింబూకి దర్శకులను వాడుకుని ఆ తర్వాత వదిలేసే ఒక చెడ్డ అలవాటుంది.

సంవత్సరాల తరబడి క్లోజ్ గా ఉన్న మిత్రులని సైతం ఒక్కసారిగా దూరం చేస్తాడీ నటుడు.తాను ఎదుగుతాడు, కానీ అవతలి వాళ్ళు ఏమైపోయారు అనేది అసలు చూసుకోడు.

అందువల్ల అతనికి సక్సెస్ అందించిన డైరెక్టర్లు దారి మారిపోయి కనుమరుగవుతుంటారు.

Telugu Aj Murugan, Kollywood, Manmadhan, Nandhu, Shimbu, Tamil Directors, Tollyw

నిజానికి శింబు దూరం చేసిన కొంతమంది డైరెక్టర్లు సక్సెస్ అయ్యారు.ఆ విషయంలో ఫరవాలేదు కానీ మిగతా వారికి శింబు లైఫ్ ఇవ్వకపోతే వారు శింబూని నమ్మక ద్రోహిగా పరిగణించి తిట్టుకుంటారు.అలా దూరమైపోయిన వాళ్ళలో మన్మధన్ దర్శకుడుతో పాటు, కెట్టవన్ దర్శకుడు G.

T.నందు, ఏఏఏ దర్శకుడు అధిక్ రవిచంద్రన్, నిర్భందం దర్శకుడు బండి సరోజ్ కుమార్ వంటి ఎందరో ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube