విజయవాడ సెంట్రల్( Vijayawada Central ) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఇటీవలే సెంట్రల్ నియోజకవర్గానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను( Vellampalli Srinivas ) వైసీపీ అధిష్టానం ఇంఛార్జ్ గా నియమించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నియోజకవర్గ కార్పొరేటర్లతో వైసీపీ ఇంఛార్జ్ వెల్లంపల్లి భేటీ అయ్యారు.
ఇందులో భాగంగా నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితులతో పాటు పెండింగ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అయితే ఈ కార్పొరేటర్ల సమావేశానికి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు( Malladi Vishnu ) గైర్హాజరు అయ్యారు.పార్టీ హైకమాండ్ టికెట్ కేటాయించకపోవడంపై మల్లాది విష్ణు అసంతృప్తితో ఉన్నారు.