పుష్ప లీక్స్.. ఈసారి థియేటర్స్ బద్దలవ్వడం ఖాయం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే.

 Video Of Allu Arjun Massy Dance Number From Sukumar Pushpa Goes Viral Details, A-TeluguStop.com

మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతొ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు.

పుష్ప చిత్ర యూనిట్ వదులుతున్న ఆసక్తికర అప్డేట్ లు ఈ సినిమాపై మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.అయితే పుష్ప మేకర్స్ లీకుల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఎదో ఒక ఫోటోనో, వీడియో నో బయటకు వస్తూనే ఉంది.ఇక తాజాగా సెట్స్ నుండి లీకైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నవంబర్ 4న దీపావళి సందర్భంగా ఈ సినిమా నుండి డాన్స్ నంబర్ నుండి ఒక స్టిల్ ను అభిమానులతో పంచుకున్నారు.

ఈ పాట 1000 మంది డాన్సర్లతో భారీ స్థాయిలో చిత్రీకరించారు.ఇది బిగ్ స్క్రీన్ మీద అభిమానులకు పెద్ద పండుగ అనే చెప్పాలి.తాజాగా ఈ సినిమా నుండి లీక్ అయినా వీడియో ఈ పాట చిత్రీకరణకు సంబందించినది అనే తెలుస్తుంది.

ఇక ఈ పాట చిత్రీకరణ సమయంలో సెట్ మొత్తం జాతర లాగా తలపిస్తుంది.ఈ వీడియోలో ”హే బిడ్డా ఇది నా అడ్డా” అంటూ బీట్ వినిపిస్తుండగా అల్లు అర్జున్ రంగురంగుల పొగ మధ్య 1000 మంది బ్యాక్ గ్రౌండ్ డాన్సర్లతో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు.ఇక ఈ వీడియో చూసిన అభిమాన లు ఈసారి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటూ సంతోష పడుతున్నారు.ఈ సాంగ్ ను రివీల్ చేస్తూ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ అనుకున్నారు.

కానీ అంతక ముందే ఈ సాంగ్ లీక్ అవ్వడంతో మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube