బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండడంతో స్టార్ డైరెక్టర్లు సైతం ఈయనతో సినిమా చేయాలని పోటీ పడుతున్నారు.ఇటీవలే సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో నందమూరి ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.సంక్రాంతి కానుకగా జనవరి 12న వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా పండుగ రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి.మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.అఖండ వంటి భారీ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంతో నందమూరి ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఉన్నారు.ఈ సినిమా మొదటి వారం మంచి వసూళ్లను సాధించింది.

కానీ రెండవ వారం మాత్రం కాస్త డల్ అయ్యింది అనే చెప్పాలి.ముఖ్యంగా జనవరి 26న రిపబ్లిక్ డే హాలిడే రోజు కూడా ఈ సినిమా పెద్దగా కలెక్షన్స్ సాధించలేక పోయింది.నిన్న కలెక్షన్స్ పెరుగుతాయని అంత భావించారు కానీ హాలిడే రోజు కూడా వసూళ్లు పెరగక పోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు.ఈ సినిమా 15 రోజుల్లో వరల్డ్ వైడ్ గా కలిపి 75.68 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అయితే 15వ రోజు మాత్రం 26 లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది.అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మాత్రం సాధించింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 73 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు ప్రకటించగా.15 రోజుల్లోనే 74 కోట్ల టార్గెట్ ను ఫినిష్ చేసి 1.60 కోట్ల లాభాలను అయితే తెచ్చిపెట్టింది.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.