చికెన్ కోసం బజార్‌కు వెళ్లి.. తిరిగి ఇంటికి వచ్చేసరికి రూ.75 లక్షలు గెలుచుకున్నాడు.. అదెలా అంటే

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు.అదృష్టం తలుపు తడితే పేదవాడు కూడా ఒక్క రోజులోనే లక్షాధికారి అవుతాడు.

 Us Man Won One Lakh Dollars Lottery On The Way To Buy Chicken Details, Us Man C-TeluguStop.com

తాజాగా అలాంటి సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.ఒక వ్యక్తి చికెన్ కోసం బజార్‌కు వెళ్లి.తిరిగి ఇంటికి వచ్చేసరికి రూ.75 లక్షలు సంపాదించాడు.అదెలా అంటే, అతను 1 లక్ష డాలర్ల (రూ.75 లక్షలు) జాక్‌పాట్ కొట్టాడు.దీంతో అతని దశ దిశ తిరిగిపోయింది.ఈ విషయం స్థానికంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

వివరాలలోకి వెళ్తే… అమెరికా దేశం, మేరీల్యాండ్, హాగర్స్‌టౌన్‌లో 52 ఏళ్ల ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.అయితే ఆదివారం రోజు భార్య చికెన్ తీసుకురమ్మని అతడిని బయటికి పంపింది.

అలా చికెన్ కోసం బయటకెళ్ళిన అతను మార్గమధ్యంలో లాటరీ సెంటర్ దగ్గర ఆగాడు.తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని లాటరీ వెండింగ్ మెషిన్ నుంచి ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.

ఇందుకు ఏకంగా పది డాలర్లు ఖర్చు పెట్టాడు.అయితే ఇంటికి వచ్చిన తరువాత తాను కొన్న లాటరీ టికెట్ ను స్క్రాచ్ చేశాడు.

అందులో అతడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక లక్ష డాలర్ల గెలుచుకున్నట్లుగా కనిపించింది.దాంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఒకే ఒక్క రోజులో 10 డాలర్లతో లక్ష డాలర్లు రావడంతో అతని కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు.

లాటరీ గెలుచుకున్న అదృష్టవంతుడు తాజాగా మీడియాతో మాట్లాడాడు.అసలు తనని లాటరీ వరిస్తుందని ఊహించలేదని చెప్పుకొచ్చాడు.అంటే చాలా అప్పులు ఉన్నాయని వాటిని లాటరీ డబ్బులతో తీరుస్తాను అని తెలిపాడు.

మిగిలిన నగదుతో టీవీ కొంటానని, ఇల్లు కట్టుకుంటానని, కుటుంబంతో కలిసి మంచి టూర్ ప్లాన్ చేస్తానని వెల్లడించాడు.ఈ విషయం తెలిసిన అతని ఫ్రెండ్స్, స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube