బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా తన వస్త్రధారణ విషయంలో నెటిజన్ల నుంచి భారీ ట్రోలింగ్ ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరో రెండు రోజులలో ఈ ఏడాది పూర్తి కావడంతో పలు ఇన్స్పిరేషన్ కొటేషన్స్ తెలియజేశారు.
నా జీవితంలో ఎన్నోసార్లు నేను ఫెయిల్ అయ్యాను.అయితే ఈ బాధ నుంచి బయట పడటం కోసం చావు మాత్రమే శరణ్యమని భావించాను.
రిలేషన్ షిప్స్, డబ్బులు, కెరియర్ లో ఫెయిల్ అవడం నన్ను ఒక లూసర్ గా నిలబెట్టాయి.అయితే ఇప్పుడు కూడా ఇవన్నీ నా దగ్గర లేవు.

ప్రస్తుతం నా దగ్గర నమ్మకం అనేది మాత్రమే ఉందని.నేను ఇప్పటికి ఇంకా బ్రతికి ఉన్నానంటే అందుకు గల కారణం ఎప్పుడూ బతకడం ఆపకపోవడమే కాకుండా నా గమ్యాన్ని చేరుకోపోవడమే.ప్రస్తుతం నేను నా గమ్యాన్ని చేరుకునే మార్గంలో పయనిస్తున్నాను.ప్రస్తుతం నా చుట్టూ ఉన్న ఈ పరిస్థితుల కన్నా నువ్వు బలవంతుడవు.అందుకే గెటప్, ఫైట్, రిపీట్ అని ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది స్పందించి మొట్టమొదటిసారిగా ఈమె నోటి వెంట ఇలాంటి మంచి మాటలు వస్తున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.
అలాగే మరి కొందరు తను అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.