తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓటమి అంటూ ఎరగని దర్శక నిర్మాతలలో తెలుగు ప్రముఖ దర్శకుడు “ఎస్ఎస్ రాజమౌళి” ఒకరు.అయితే దర్శకుడు రాజమౌళి తన సినిమాల చిత్రీకరణ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ ప్రేక్షకులకు మాత్రం 100% వినోదం అందిస్తూ అలరిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ని ప్రపంచానికి పరిచయం చేశాడు.అయితే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెలుగులో ఆర్.
ఆర్.ఆర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తి కావడంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.అంతేకాక ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి అధికార ప్రకటన వెలువడటంతో డిస్ట్రిబ్యూషన్ పనులు కూడా పూర్తయ్యాయి.
దీంతో జక్కన్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కలవర పెడుతోంది.
ఈ క్రమంలో రోజురోజుకీ దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి.దీనికితోడు మరో వైపు కరోనా వైరస్ కేసులు కూడా పెరుగుతున్నాయి.
దీంతో ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో రాత్రిపూట కర్ఫ్యూ మరియు అత్యవసర సమయంలో మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఇప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ హీరోలు తమ చిత్రాల విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.
దాంతో ఈ ఒమిక్రాన్ ప్రభావం ఆర్.ఆర్.ఆర్ చిత్రంపై కూడా పడబోతోందని దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్ర విడుదల వాయిదా వేస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో తాజాగా ప్రముఖ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయంపై స్పందించాడు.
ఇందులో భాగంగా ఒమిక్రాన్ కారణంగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం వాయిదా పడుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని అలాగే ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే ఏడాది జనవరి 7వ తారీఖున ఈ చిత్రాన్ని ఖచ్చితంగా విడుదల చేస్తున్నట్లు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు.
దీంతో ఆర్.ఆర్.ఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఇంకొందరు మాత్రం కరోనా వైరస్ కంటే ఒమిక్రాన్ మానవ ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఒకవేళ పరిస్థితులు చేజారిపోతే ఆర్.ఆర్.ఆర్ చిత్రం విడుదల చేయడం కన్నా కొన్ని రోజులు పాటు వాయిదా వేయడమే మేలని సూచిస్తున్నారు.ఇలా చేయడం వల్ల మానవాళి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చిత్ర కలెక్షన్లకి కూడా ఎలాంటి నష్టం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో తెలుగు ప్రముఖ హీరోలయిన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు అజయ్ దేవగన్, అలియా భట్, శ్రేయ శరణ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
కాగా ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ సినీ దర్శకుడు “డీవీవీ దానయ్య” నిర్మాతగా వ్యవహరించాడు.అయితే ఈ చిత్రం కోసం దాదాపుగా 350 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం.అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, తదితర భాషలలో దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
దాంతో బాక్సాఫీస్ ఓవర్సీస్ కలెక్షన్లలో దాదాపుగా 900 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇదే కనుక జరిగితే త్వరలోనే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.