ప్రపంచంలో ఎక్కడ చూసిన ప్రస్తుతం ఆ పేరే వినిపిస్తోంది.ఆ పేరు వింటేనే ప్రపంచ దేశాలకు నిద్ర కూడా పట్టడం లేదు.
ఇంతకీ ఆపేరు ఏంటంటారా? అదేనండీ కరోనా.మొన్నటి వరకు తగ్గినట్టే అనిపించినా ఈ మహమ్మారి , మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ ఆంక్షలు కొనసాగుతున్నాయి.మాస్క్ ధరించడం.
భౌతిక ధూరం పాటించడం వంటి నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి ఆయా దేశాలు.దీంతో ఎక్కడికెళ్లినా ముఖానికి మాస్క్ ఉండాల్సిందే.
మాస్క్ ధరించని వారిని విమానాల్లో నుంచి బయటకు పంపించిన ఘటనలు ఈమధ్య అనేకం చూశాం.ఇది ఒక రకంగా మంచిదే అయినా కొందరు మాత్రం శ్రుతిమించి వ్యవహరిస్తూ తోటివారిని ఇబ్బంది పెడుతున్నారు.
తాజాగా డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ఈలాంటి ఘటనే చోటుచేసుకుంది.విమానంలో ఉన్న ఓ వృద్ధుడు మాస్క్ ధరించలేదని అతనితో గొడవకు దిగింది ఓ మహిళ.పైగా ఆమె కూడా మాస్క్ ధరించకపోవడం గమనార్హం.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ప్రయాణిస్తున్న ప్యాట్రిసియా కార్న్‌వాల్ అనే మహిళ తన వెనక సీటులో కూర్చొన్న ఓ వృద్ధుడి దగ్గరకు వెళుతుంది.అయితే ఆ సమయంలో ఆయన భోజనం చేస్తున్నాడన్న ఇంగిత జ్ఞానం లేకుండా అతనితో ఘర్షణకు దిగుతోంది.మాస్క్ ఎందుకు ధరించడం లేదని వృద్ధుడితో వాదనకు దిగింది.పక్కనున్న వాళ్లు వారిస్తున్నా వినిపించుకోకుండా వృద్ధుడిపై దాడికి తెగబడింది.ఇంతలో అక్కడికి వచ్చిన విమాన సిబ్బంది ఆమెను లాక్కెళ్లారు.అనంతరం విమానం అట్లాంటాలో ల్యాండ్ అవ్వగానే అక్కడి ఎఫ్‌బీఐ అధికారులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ స్పందించింది.విమానంలో అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే.
అంతమాత్రాన ఎదుటి వారిపై దాడి చేయడం వంటి వికృత ప్రవర్తనను ఏ మాత్రం సహించేది లేదంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.