ట్రాయ్ డీఎన్డీ యాప్ ఫోన్ లో ఉంటే స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టినట్టే..!

ప్రస్తుత కాలంలో స్పాం కాల్స్ తో( Spam Calls ) చాలామంది విసిగిపోయింటారు.అపరిచిత వ్యక్తి నుండి ఫోన్ కాల్ లేదా మెసేజ్ వస్తే రిప్లై ఇవ్వాలా వద్దా అనే విషయంలో చాలామంది సతమతమవుతున్నారు.

 Trai Dnd App To Help Users Block Unwanted Callers Details, Trai ,dnd App , Block-TeluguStop.com

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా( TRAI ) ఓ సరికొత్త యాప్ ప్రవేశపెట్టింది.ఈ యాప్ తో స్పాం కాల్స్ కు చెక్ పెట్టవచ్చు.

ప్రజలను బాధించే ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్ లను నివారించడం కోసం డోంట్ డిస్టర్బ్( Do Not Disturb App ) అనే ఒక కొత్త యాప్ ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డెవలప్ చేసింది.ప్రస్తుతం ఈ యాప్ లో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి.

ఆ సమస్యలను సాంకేతిక బృందం పరిష్కరించే పనిలో ఉంది.స్వయంగా TRAI కార్యదర్శి వి.రఘునందన్ ట్రూ కాలర్ ఈవెంట్ లో ప్రస్తావించడం జరిగింది.

Telugu Block Spam, Dnd App, Disturb App, Spam, Spam Messages, Trai, Trai Dnd App

TRAI ముఖ్య ఉద్దేశం డోంట్ డిస్టర్బ్ యాప్ ద్వారా వినియోగదారులకు స్పామ్ కాల్స్, మెసేజెస్ లపై రిపోర్ట్ చేయడం లేదా బ్లాక్ చేయడం.ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఇబ్బందికరమైన కమ్యూనికేషన్లను సులభంగా రిపోర్ట్ చేయవచ్చు.ఈ యాప్ లో గుర్తించిన బగ్ లను( Bugs ) పరిష్కరించడం కోసం TRAI ఒక ఎక్స్ ట్రనల్ నియమించింది.

అన్ని సమస్యలను పరిష్కరించి మార్చి 2024 నాటికి అన్ని డివైస్ లో ఈ యాప్ విశ్వవ్యాప్తంగా పనిచేసేలా ప్లాన్ చేస్తున్నట్లు TRAI తెలిపింది.

Telugu Block Spam, Dnd App, Disturb App, Spam, Spam Messages, Trai, Trai Dnd App

అయితే ఈ యాప్ ఐఫోన్ లకు( iPhone ) సపోర్ట్ చెయ్యదు.కాబటి ఈ యాప్ ను iOS లకు సపోర్ట్ చేసేలా మార్చాలని TRAI ప్రయత్నిస్తోంది.ఈ యాప్ అందుబాటులోకి వస్తే అలా వరకు స్పామ్ కాల్స్ తగ్గే అవకాశం ఉంది.

ఈ యాప్ ఎలా ఉపయోగించాలి అంటే.గూగుల్ ప్లే స్టోర్ నుంచి TRAI DND 3.0 యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.ఫోన్లో ఇన్స్టాల్ అయ్యాక వన్ టైం పాస్వర్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి సైన్ ఇన్ అవ్వాలి.

సైన్ ఇన్ అయిన తర్వాత స్పాం కాల్స్ మెసేజ్లను బ్లాక్ చేయడం ద్వారా మీ నెంబర్ డోంట్ డిస్టర్బ్ ఖాతాకు చేరుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube