మనుషుల ప్రాణాలను ఆరతి కర్పూరంలా ఈ సంవత్సరం కరిగించేస్తుంది.అసలే కరోనా వచ్చిందనే భయంతో ఆస్పత్రికి వెళ్లితే బెడ్లు ఖాళీగా లేవని సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ హస్పటల్లో బెడ్డు దొరికితే బ్రతకడానికి డబ్బులు వెదజల్ల వలసి వస్తుంది.లక్షల్లో ఫీజులు చెల్లించినా బ్రతుకుతామనే నమ్మకం కలగడం లేదు.
సరే ఏదోలా చావునుండి బయటపడుతున్నామని అనందించేలోగా ఊహించని ప్రమాదాల వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి.
ప్రస్తుతం పరిస్దితుల్లో కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేసే దవఖానాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విచారకరం ఇకపోతే నగరంలోని కింగ్‌కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు కరోనా బాధితులు ఆక్సిజన్ అందక మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
జడ్చర్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం కావడంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నట్లు దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం.ఇదిలా ఉండగా ఆక్సిజన్ అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు
.