వామ్మో.. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ అన్ని రూ.కోట్లా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో విశ్వక్ సేన్ ఒకరు.విశ్వక్ సేన్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా సినిమా సినిమాకు విశ్వక్ సేన్ మార్కెట్ కూడా పెరుగుతోంది.

 Tollywood Young Hero Vishwak Sen Remuneration Details Here Goes Viral , Tollywoo-TeluguStop.com

అదే సమయంలో విశ్వక్ సేన్ తన పారితోషికాన్ని కూడా అంతకంతకూ పెంచుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

పలు వివాదాల ద్వారా విశ్వక్ సేన్ వార్తల్లో నిలిచినా ఈ హీరోకు ఉండే పాపులారిటీ అంతాఇంతా కాదు.ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈ హీరో 4.5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Telugu Ashokavanamlo, Dhamki, Pagal, Tollywood, Vishwak Sen-Latest News - Telugu

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన విశ్వక్ సేన్ త్వరలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కనున్న సినిమాలో కనిపించనున్నారు.విశ్వక్ సేన్ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు ఎక్కువ మొత్తానికి అమ్ముడవుతున్న నేపథ్యంలో ఈ హీరో సినిమాల బడ్జెట్లు పెరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.విశ్వక్ సేన్ వరుస విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Telugu Ashokavanamlo, Dhamki, Pagal, Tollywood, Vishwak Sen-Latest News - Telugu

కరోనా థర్డ్ వేవ్ తర్వాత సినిమాల హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో విశ్వక్ సేన్ పారితోషికం ఊహించని స్థాయిలో పెరిగింది.వివాదాలకు దూరంగా ఉంటే విశ్వక్ సేన్ స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవడం అయితే కష్టం కాదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ తన సినిమాలలో పాటలు స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

క్రేజ్ ఉన్న హీరోయిన్లు తన సినిమాలలో నటించేలా విశ్వక్ సేన్ జాగ్రత్త పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube