తెలుగులో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించిన “ఆదిత్య 369” అనే చిత్రంలో నందమూరి నట సింహం బాలకృష్ణ కి జంటగా నటించి సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన తమిళ వెటరన్ హీరోయిన్ “మోహిని” గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మొదటగా హీరోయిన్ మోహిని, బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సరసన నటించి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎందుకో సినిమా అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.
కానీ అప్పుడప్పుడు పలు తెలుగు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి బాగానే అలరించింది.
అయితే నటి మోహిని అసలు పేరు మహాలక్ష్మి.
కానీ అప్పటికే ఆ పేరుతో సినిమా పరిశ్రమలో చాలామంది ఉండటంతో కొందరు సినీ దర్శక నిర్మాతలు ఈమెకి మోహిని గా నామకరణం చేశారు.అయితే నటి మోహిని తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు ప్రాంతంలో నివసిస్తున్న ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.
చిన్నప్పటి నుంచి నటి మోహిని కి నటనపై ఆసక్తి ఉండటంతో ఆమె తల్లిదండ్రులు కూడా నటన రంగంపై బాగానే ప్రోత్సహించారు.
దీంతో మోహిని సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కొంతమేర బాగానే రాణించింది.
ఈ క్రమంలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నటువంటి భరత్ అనే ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది.దీంతో ప్రస్తుతం వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు.
కాగా నటి మోహిని ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో నివాసం ఉంటోంది.
ఆ మధ్య కాలంలో నటి మోహిని కి పెళ్లయిన తర్వాత పలు ఆరోగ్య సమస్యలు వచ్చాయని దాంతో ఆమె భర్త భరత్ తో కొంతమేర మనస్పర్ధలు, విభేదాలు రావడంతో విడాకులు తీసుకునే వరకూ ఈ వ్యవహారం వెళ్లినట్లు పలు వార్తలు బలంగా వినిపించాయి.
కానీ వీరిద్దరి విషయంలో ఇరువురి కుటుంబ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం నటి మోహిని తన భర్తతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది.
అంతేగాక మోహిని క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి అమెరికాలో మత భోదకురాలిగా కూడా పని చేస్తోంది.