టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏప్పుడూ ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది.ఏదో ఒక డైరెక్టర్ తన అభిమాన హీరోకు అదిరిపోయే హిట్ ఇస్తుంటాడు.
గతం నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది.అప్పట్లో జూనియర్ ఎన్టీయార్‌కు రాజమౌలి వరుస హిట్స్ అందించాడు.
ఈ మధ్యకాలంలో డార్లింగ్ ప్రభాస్‌కు బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్ వంటి పాన్ ఇండియా రేంజ్ హిట్స్ ఇచ్చి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్నాడు.ఇక సుకుమార్ కూడా రామ్ చరణ్‌కు రంగస్థలంతో బాక్సాఫీసు బద్దలు కొట్టాడు.
ప్రస్తుతం మళ్లీ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ రెడీ అవుతున్నాడు.
ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరోలకు హిట్స్ కామన్.
లేదంటే వారి జీవితమే మారిపోతుంది.సినిమా అవకాశాలు తగ్గుతాయి.
అందుకే అగ్రహీరోలు హిట్స్ ఇచ్చే డైరెక్టర్లనే పక్కన పెట్టుకుంటారు.హిట్ పడితో ఫస్ట్ ప్లేస్‌కు వెళ్లడం, వరుసగా రెండు ప్లాపులు పడితే కిందకు వెళ్ళడం ఇవన్నీ కామనే.
అయితే, ఈ పదేళ్ళ కాలంలో టాలీవుడ్ హీరోలు ఏం ఘనత సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటే గత 11 ఏళ్లలో 10 సినిమాల్లో నటించగా అందులో రెండే హిట్ అయ్యాయి.

ఒకటి గబ్బర్ సింగ్, రెండోది అత్తారింటికి దారేది. మిగతావి యావరేజ్ అనిచెప్పొచ్చు.ఇక మహేశ్ బాబు 11 ఏళ్లలో 12 సినిమాలు చేయగా 7 హిట్ అవ్వగా మిగతావి ప్లాపు అయ్యాయి.అల్లు అర్జున్ కూడా మొత్తం 12 మూవీస్ చేయగా 5 హిట్ కాగా, యావరేజ్‌గా నడిచాయి.

రామ్ చరణ్ 11ఏళ్లలో 10 మూవీస్ చేయగా 5హిట్ మిగతావి బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.డార్లింగ్ ప్రభాస్ 11 ఏళ్లలో 7 ఏడు మాత్రమే చేయగా అందులో 5 హిట్స్.బాహుబలి వన్ అండ్ టుతో కలుపుకుని.ఎన్టీఆర్ 11 ఏళ్లలో ఏకంగా 13 మూవీస్ లో నటించగా 7 హిట్ అవ్వగా మిగతావి ఫ్లాప్ అయ్యాయి.