సినిమా ఇండస్ట్రీ ఎవరికీ పూల పాన్పు కాదు.తమ వెనకాల స్టార్ హీరోలు ఉన్నా, హీరోయిన్స్ ఉన్నా తమకు తాము ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిందే.
కానీ ఒక్కోసారి తమ కుటుంబ సభ్యులు తెచ్చే సమస్యల వల్ల తమ కెరియర్ ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది.అలాంటి ఒక రెండు సంఘటనల గురించి మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అలనాటి స్టార్ హీరోయిన్స్ ఇద్దరు తమ పిల్లల విషయంలో చేసిన తప్పటడుగులు వారి జీవితాలను అఘాతంలో ముంచేశాయి.వారు హీరోయిన్స్ గా పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదు అనుకున్నారో లేదంటే వారు చూసిన స్టార్ డం తమ పిల్లలు కూడా చూడాలని భావించారో ఏమో కానీ మొత్తానికి పిల్లలని కంట్రోల్ చేయడంతో వారి జీవితం నష్టపోయారు మరి ఆ హీరోయిన్స్ ఎవరు ఏం జరిగిందో చూద్దాం.
అలనాటి స్టార్ హీరోయిన్ మంజులకి ముగ్గురు కుమార్తెలు.కొడుకులు లేకపోవడంతో ఇండస్ట్రీలోకి కూతుళ్లను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.
అనుకున్నదే తడవుగా టీనేజ్ లో ఉన్న తన పెద్ద కుమార్తె వనితను హీరోయిన్ చేసింది.కానీ వనిత అప్పుడప్పుడే లోకాన్ని చూస్తుంది హీరోయిన్ అంటే ఏంటో కూడా తెలియదు.
నటన, మేకప్ అస్సలు ఇష్టం లేదు.తన ఇంట్లో తన కళ్ళ ముందు జరిగే విషయాలను ఆమె ఒప్పుకోలేకపోయింది.
దాంతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉండలేక బయటకు వెళ్లలేక కష్టాలు పడింది.ఆ వయసులో తెలిసి తెలియక పెళ్లిళ్లు చేసుకుని జీవితం కూడా కోల్పోయింది.
మొత్తానికి వనిత ఈరోజు ఇలా ఫెయిల్యూర్ గా ఉండడానికి కారణం పూర్తిగా ఆమె తల్లి తీసుకున్న నిర్ణయం అనే చెప్పాలి.

రోజా రమణి .స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో కొన్నేళ్లపాటు ఏకచత్రాధిపత్యం చేసింది.తన కొడుకు తరుణ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి పరిచయం చేసింది.
అలా చూస్తుండగానే హీరోగా కూడా అయిపోయాడు తరుణ్.కానీ అసలు సమస్య అప్పుడే మొదలైంది.
ఈ సినిమా లో నటించాలి అనే క్లారిటీ లేదు.తల్లి చెప్పినట్టుగా చేసి కొన్ని సినిమాల్లో నటించి బొక్క బోల్తాపడ్డాడు.
అలాగే తను ప్రేమించిన అమ్మాయిని కూడా వద్దు అనడంతో ఒంటరివాడయ్యాడు.చివరికి అటు కెరియర్ పోయింది ఇటు అమ్మాయి పోయింది.
ప్రస్తుతం ఏం చేయాలో తెలియక ఒంటరి జీవితం గడుపుతున్నాడు.