హ్యాపీ డేస్ సినిమా(Happy Days Movie) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు వరుణ్ సందేశ్ (Varun Sandesh) ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ హీరో తెలుగులో పలు సినిమాలలో నటించారు.అయితే గత కొంతకాలంగా ఎలాంటి సినిమా అవకాశాలు లేకపోవడంతో వరుణ్ సందేశ్ సినిమాలకు దూరంగా ఉన్నారు .
అయితే చాలా రోజుల తర్వాత వరుణ్ సందేశ్ ది కానిస్టేబుల్ (The Constable) అనే ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.
జాగృతి మూవీస్ మేకర్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని బలగం జగదీష్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ పనులు జరుపుకుంటుంది.ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో హీరో వరుణ్ సందేశ్ ప్రమాదానికి గురయ్యారు.దీంతో ఈయన కాలుకి బలమైన గాయం కావడంతో దాదాపు మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ చెప్పారట దీంతో ఒక్కసారిగా సినిమా షూటింగ్ కి బ్రేక్ పడినట్టు అయ్యింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఫైట్ సన్నివేశంలో భాగంగా వరుణ్ సందేశ్ కాలికి దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది.

ఇలా కాలికి బలమైన దెబ్బ తగలడంతో వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లగా కట్టు కట్టిన అనంతరం మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు.ఇక మూడు వారాలపాటు వరుణ్ సందేశ్ సినిమా షూటింగ్ కు దూరం కాబోతున్నారు.దీంతో సినిమా షూటింగ్ కూడా కాస్త ఆలస్యం కానుంది.
అయితే సినిమా షూటింగ్ సమయంలో ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగడం సర్వసాధారణం.అయితే కొన్ని సినిమాల షూటింగ్లలో జరిగిన ప్రమాదాలు కారణంగా కొందరు ఆర్టిస్టులు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.
అయితే వరుణ్ సందేశ్ కు ఇలా ప్రమాదం జరిగిందనే విషయం తెలియడంతో అభిమానులు ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు.