తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా( Roja ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా రోజా సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
ఈ తరం ప్రేక్షకులకు రోజా జబర్దస్త్( Jabardasth ) ద్వారా మరింత చేరువ అయ్యిందని చెప్పవచ్చు.సినిమాల ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకుని స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది రోజా.
ఈ వయసులో కూడా అంతే ఎనర్జిటిక్ గా ఉంటూ ఆడుతూ పాడుతూ డాన్సులు చేస్తూ ఉంటుంది.
బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.
ఇది ఇలా ఉంటే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిన రోజా రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొంటూ వైఎస్సార్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలే మంత్రి హోదాను కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే.అయితే ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు జబర్దస్త్ షోలో పాల్గొన్న రోజా మంత్రి అవ్వడంతో బుల్లితెర కు గుడ్ బాయ్ చెప్పేసింది.
ఇది ఇలా ఉంటే హీరోయిన్ రోజా గురించి ఫ్యామిలీ గురించి మనందరికీ తెలిసిందే.
రోజా భర్త పేరు సెల్వమని కాగా కూతురు అన్షు మాలిక కొడుకు రోషన్. మరి ముఖ్యంగా కూతురి విషయానికి వస్తే రోజా తల్లికి తగ్గ కూతురిగా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.చిన్న వయసులోనే గొప్ప మనసు ఎంతోమంది అనాధలను చేరదీసి చదివిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ప్రముఖ మీడియా ఛానల్ వారు చెన్నైలో ఉన్న రోజా ఇంటికి వెళ్లి హోమ్ టూర్( Roja Home Tour ) వీడియోని చేశారు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్పట్లోనే నిర్మించిన ఈ ఇల్లు ఎంతో అద్భుతంగా ఉంది.ఇంటి నిండా భర్త పిల్లలతో కలిసి దిగిన ఫోటోలతో నింపేశారు.మరి ముఖ్యంగా పూజా కూతురు అన్షు మాలిక గదినిండా కూడా మొత్తం అవార్డులు రివార్డులు చెప్పవచ్చు.దాదాపు ఒక 50,60 కి పైగా మెడల్స్ కూడా ఉన్నాయి.
ఇంత చిన్న వయసులోనే తల్లికి దగ్గర కూతురు అనిపించుకోవడంతో పాటు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను చేపడుతూ మంచి మంచి పుస్తకాలు రాస్తోంది.ప్రస్తుతం రోజా హోమ్ టూర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.