జుట్టు ఒత్తుగా, సిల్కీగా మెరుస్తూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.ఈ జాబితాలో స్త్రీలే కాదు పురుషులు కూడా ఉంటారు.
కానీ, కొందరి జుట్టు ఒత్తుగా ఉంటుంది.కానీ సిల్క్ గా ఉండదు.
అలాగే మరికొందరి జుట్టు సిల్కీ గా ఉంటుంది.కానీ ఒత్తుగా ఉండదు.
దాంతో ఒత్తైన సిల్కీ హెయిర్( Silky Hair ) ను ఎలా పొందాలో తెలియక సతమతం అవుతుంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే మీ జుట్టు ఒత్తుగానే కాదు సిల్కీగా కూడా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఉల్లి జ్యూస్( Onion Juice ) లో అర కప్పు కొబ్బరి పాలు, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మంచి హెయిర్ టోనర్( Hair Toner ) సిద్ధమవుతుంది.ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ తో శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే పలుచటి జుట్టు కొద్దిరోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.అలాగే కురులు సూపర్ సిల్కీగా మారుతాయి.అదే సమయంలో హెయిర్ ఫాల్ కంట్రోల్( Hairfall Control ) అవుతుంది.చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.మరియు స్కాల్ప్ శుభ్రంగా ఆరోగ్యంగా సైతం మారుతుంది.