అక్కడ కశ్మీర్ పండిట్‌లకు ఉచిత కరెంట్ సరఫరా చేయనున్నారు!

ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్‘ అందరు చూసే వుంటారు.ఇందులో కశ్మీర్ పండిట్‌లకు అప్పట్లో జరిగిన అన్యాయాలను, అరాచకాలను, ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు.

 There Will Be Free Electricity Supply To Kashmir Pandits! Kashmir Pandit, Free,-TeluguStop.com

ఈ సినిమాను మొదట్లో ఇండియన్ గవర్నమెంటే ప్రమోట్ చేసింది.తరువాత రాజకీయ ప్రముఖులు, సినిమా పండితులు ఈ సినిమా అద్భుతం అంటూ కొనియాడిన సంగతి తెలిసినదే.

ఇకపోతే తాజాగా కశ్మీర్ పండిట్‌ల షాప్‌లకు ఢిల్లీ గవర్నమెంట్ ఉచిత గవర్నమెంట్ ఇవ్వనుందని డిప్యూటీ CM మనీశ్ సిసోడియా మంగళవారం వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ… ఎలక్ట్రిసిటీ కనెక్షన్లకు, ట్రాన్సాఫార్మర్ల ఇన్‌స్టాలేషన్లకు అయ్యే ఖర్చులన్నీ కూడా కేజ్రీవాల్ ప్రభుత్వమే భరిస్తుందని అనడం హర్షణీయం.

ఒక నెలలోగా పనులన్నీ పూర్తీ చేయాలని సదరు డిపార్ట్ మెంట్ కు వారు సూచించారు.ఢిల్లీలోని కశ్మీరీ పండిట్ల సమస్యలను తీర్చి, వారి అభ్యున్నతికి కృషి చేసే విధంగా కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన అన్నారు.

BSES, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌తో సహా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సిసోడియా సమావేశం నిర్వహించారు.

Telugu Kashmir Pandit, Time, Latest-Latest News - Telugu

ఈ సందర్భంగా ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేయడానికి కేటాయించిన స్థలాన్ని తక్షణమే పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.ఒక నెలలోగా విద్యుత్ కనెక్షన్‌లు ఏర్పాటయ్యేలా చూడాలని వారికి ఆదేశించారు.అంతకుముందు, కశ్మీరీ పండిట్ల ప్రతినిధి బృందం INA మార్కెట్‌లో 100 కంటే ఎక్కువ కశ్మీరీ పండిట్‌ల దుకాణాలున్నాయని, వివిధ నిర్మాణ కార్యకలాపాల కారణంగా గతంలో చాలాసార్లు విద్యుత్ కనెక్షన్ల సమస్య గురించి కేజ్రీవాల్‌కు వివరించింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇకపోతే కశ్మీర్ పండిట్‌లమీద తీసిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చూసి కేజ్రీవాల్ కామెంట్ చేసిన సంగతి విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube