ఇటీవల మంత్రివర్గాన్ని జగన్ విస్తరించారు.ఎవరూ ఊహించిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు.
కానీ మొదటి నుంచి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారిలో అతి తక్కువ మందికి మాత్రమే అవకాశం కల్పించారు.పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతూ, ఆర్థికంగా పార్టీకి అండదండలు అందించిన చాలామంది మంత్రి పదవులను కోల్పోయారు.
మరికొందరికి మంత్రి అవ్వాలనే ఆశ తీరకుండా చేశారు.దీంతో కొంతమంది బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.
రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు .సదరు అసంతృప్తి నాయకుల అనుచరులు జగన్ తీరును తప్పుబడుతూ ఫ్లెక్సీలు చించివేయడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అసంతృప్త నేతలను వైసిపి కీలక పెద్దలు బుజ్జగించారు.దీంతో చాలామంది సైలెంట్ అయిపోయినా, ఎక్కువమంది మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.ఇక వీరే కాకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు చాలామంది లో నామినేటెడ్ పదవుల విషయంలోనూ, ఇతర అంశాలలోనూ ప్రాధాన్యత దక్కక పోవడం ఇలా రకరకాల కారణాలతో అసంతృప్తితో ఉన్నారు.ఇప్పుడు ఆ అసంతృప్త నాయకులను పైన తెలుగుదేశం పార్టీ దృష్టి పెడుతోంది.
వారంతా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో చేరుతారని, వారికి మరో ఆప్షన్ లేదనే అభిప్రాయంతో ఉంది.ఈ మేరకు తమ పార్టీలో చేరాల్సింది గా కీలక నాయకుల ద్వారా సదరు నాయకులకు రాయబారాలు పంపిస్తున్నారట.

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతి అంశంలోనూ ప్రభుత్వాన్ని , జగన్ తీరును విమర్శిస్తూ వస్తోంది.ప్రభుత్వ పథకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, రాష్ట్రాన్ని కుదేలు చేస్తున్నారని, జగన్ కు పరిపాలించే హక్కు లేదు అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపడుతూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయినా వైసిపి ప్రభుత్వంపై జనాల్లో చెడు అభిప్రాయం కలగకపోవడం, 2019 ఎన్నికల తరువాత జరిగిన అన్ని ఎన్నికలు, ఉప ఎన్నికల్లో వైసీపీ పై ప్రభావం చూపించడంతో తెలుగుదేశం ఆరోపణలు జనాలు పట్టించుకోవడం లేదనే విషయం అర్థం అయిపోయింది.దీంతో ఇప్పుడు వైసీపీలో అసంతృప్త నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా మానసికంగా వైసీపీని దెబ్బ కొట్టాలని , సొంత పార్టీ నాయకులకు జగన్ పై నమ్మకం లేదని, అందుకే వారంతా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే అభిప్రాయాన్ని కలిగించేందుకు టిడిపి ఇప్పుడు వలసల పైనే ఎక్కువ దృష్టి సారించిందట.