సినిమా పరిశ్రమకి వచ్చి రావడంతోనే మంచి హిట్ అందుకని ఆ తర్వాత తన వ్యక్తిగత కారణాల వల్ల గాని లేదా చెడు అలవాట్లకు బానిసై గానీ సినిమా కెరియర్ ని నాశనం చేసుకున్నటువంటి నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే ఇందులో ఒకప్పుడు పలు తెలుగు చిత్రాలలో రాముడు, కృష్ణుడు వేషంలో ఎంతగానో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ ప్రముఖ సీనియర్ మరియు స్వర్గీయ నటుడు హరనాథ్ ఒకరు.
కాగా నటుడు హరనాథ్ మొదటగా “మా ఇంటి మహాలక్ష్మి” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత శ్రీ సీతారామ కళ్యాణం, అనే చిత్రంతో మంచి హిట్ కొట్టి తనకంటూ మంచి ఇమేజ్ ని తెచ్చుకున్నాడు.
ఈ క్రమంలో హరనాథ్ నటనా ప్రతిభను గుర్తించిన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ పరిశ్రమలో ఎంతగానో ప్రోత్సహించారు.తాను నటించిన పౌరాణిక చిత్రాలలో కచ్చితంగా హరనాథ్ ఉంటేనే నటిస్తానని తెగేసి చెప్పేవారట.
కాగా హరనాథ్వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో పలు చెడు అలవాట్లకు బానియ్యాడు. ఈ క్రమంలో మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాల వినియోగం వంటి అలవాట్లతో సినిమా అవకాశాలపై దృష్టి సారించ లేకపోయాడు.
దీంతో చివరి దశలో కనీసం తన ఆరోగ్య పరిస్థితిని చూసుకునే వాళ్ళు కూడా లేక చాలా దీన స్థితిలో మరణించాడు.
హరినాథ్ తెలుగులో 40 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించాడు.ఇందులో శ్రీ సీతారామ కళ్యాణం, భీష్మ, పుణ్యవతి, బంగారు సంకెళ్లు, తదితర చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.కాగాతెలుగులో చివరిగా “నాగు” అనే చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తండ్రి పాత్రలో నటించాడు.
ఏదేమైనప్పటికీ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్టార్ ఇమేజ్ ని దక్కించుకున్న హరినాథ్ తన చెడు అలవాట్ల కారణంగానే సినీ భవిష్యత్తుతో పాటు జీవితం కూడా ముగిసిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.