బిగ్ బాస్ సీజన్ సిక్స్ టైటిల్ రేవంత్ గెలిచాడు.సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి రేవంత్ కచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతాడని అతని ఆట తీరు బట్టి ఆడియన్స్ చెప్పడం జరిగింది.
ఇదే సమయంలో రేవంత్ నామినేషన్ లో ఉన్న టైంలో అందరికంటే అత్యధికమైన ఓట్లు రాబట్టాడు.మొదటినుండి హౌస్ లో మాస్క్ లేని గేమ్ ఆడుతూ వచ్చాడు.
మధ్యలో కొద్దిగా కోపంతో… నెగిటివ్ తెచ్చుకున్నా గాని తరువాత సరి చేసుకుని మంచి ఆట తీరు కనబరిచి టైటిల్ విజేతగా నిలిచాడు.
మిడ్ వీక్ ఎలిమినేషన్ లో.శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో మొత్తం ఐదుగురు ఉన్నారు.దీంతో ఫినాలే రోజు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా రోహిత్, టాప్ ఫోర్ లో ఆదిరెడ్డి నిలిచి హౌస్ నుండి బయటకు రావడం జరిగింది.
తర్వాత హీరో రవితేజ హౌస్ లోకి వచ్చి కీర్తి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడం జరిగింది.అనంతరం హౌస్ లో రేవంత్, శ్రీ హాన్ లలో ఒకరు ₹40 లక్షల తీసుకుని బయటకు రావచ్చని నాగార్జున ఆఫర్ ఇచ్చారు.
దీంతో శ్రీహాన్ … ఈ ఆఫర్ తీసుకోవటంతో రేవంత్ విన్నర్ గా నిలిచాడు.ప్రైజ్ మనీ 50 లక్షలలో రేవంత్ కి 10 లక్షలు దక్కనున్నాయి.
అంతకుముందే ఇండియన్ ఐడిల్ గెలవడం.ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సిక్స్ విజేత కావడంతో రేవంత్ అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ హడావిడి చేస్తున్నారు.కాగా దాదాపు 21 మంది.టైటిల్ కోసం హౌస్ లో ఎంట్రీ ఇచ్చి 15 వారాలు పోటీపడ్డారు.కానీ చివర ఆఖరికి రేవంత్ కి వరించింది.సీజన్ స్టార్టింగ్ నుండే రేవంత్… చాలా కాన్ఫిడెంట్ గేమ్ ఆడుతూ వచ్చాడు.
తన జర్నీ టైంలో కూడా కచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ అవుతానని.అన్నాడు.
తాను చెప్పినట్టుగానే గెలవడం విశేషం.