శ్రీ శ్రీ మూవీ రివ్యూ

చిత్రం : శ్రీశ్రీ
బ్యానర్ : శ్రీ బాలాజీ శ్రీనివాస ప్రొడక్షన్స్
దర్శకత్వం : ముప్పలనేని శివ
నిర్మాతలు : సాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి , షేక్ సిరాజ్
సంగీతం : ఈ.ఎస్ .మూర్తి
విడుదల తేది : జూన్ 3, 2016
నటీనటులు : సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్, సాయి కుమార్, అంగనా రాయ్, మురళీశర్మ, పోసాని, తదితరులు

 Sri Sri Movie Review-TeluguStop.com

సీనియర్ దర్శకుడు ముప్పలనేని శివ చాలాకాలం తరువాత దర్శకత్వం వహించిన సినిమా శ్రీశ్రీ .ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నాక సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి సినిమా కావడంతో ఆయన అభిమానులు ఈ చిత్రం కోసం చాలా ఎదురుచూశారు.మరి శ్రీశ్రీ ఎలా ఉందో చూద్దాం.

కథలోకి వెళ్తే …

శ్రీపాద శ్రీనివాస రావు (కృష్ణ) ఒక రిటైర్డ్ “లా” కాలేజి ప్రొఫెసర్.తన అనుభవం నేటి యువతకి కూడా పనికి రావాలని న్యాయ వ్యవస్థ మీద పుస్తకాలు రాస్తూ ఉంటారు.

ఆయన భార్య సుమతి (విజయనిర్మల).ఈ దంపతులకి ఓ కూతురు శ్వేత (అంగనా రాయ్).

శ్వేత ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేస్తూ ఉంటుంది .తండ్రీ లాగే కూతురికి కూడా చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి పట్టింపు ఎక్కువ

ఇదిలా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ఒక క్రూరమైన బిజినెస్ మెన్ జేకే భరద్వాజ్ (మురళీశర్మ) తన ఫ్యాక్టరీలో తయారుచేస్తున్న ప్రమాదకర మందులు ఒక ఊరి మనుషులపై ప్రయోగిస్తూ ఉంటాడు.ఈ విషయాన్ని సూర్యారావు (సాయికుమార్) సహాయంతో , మీడియా ద్వారా ప్రజలకి తెలియజేయాలని ప్రయత్నించే శ్వేతని , శ్రీనివాసరావు కళ్ళ ముందే చంపేస్తారు జేకే కొడుకు, అతని స్నేహితులు .
చంపబడిన శ్వేతకి న్యాయం జరిగిందా ? జరగకపోతే శ్రీశ్రీ ఏం చేసాడు ? ఈ కేసులో ఏసిపి అజయ్ కుమార్ (నరేష్) పాత్ర ఏంటి? జేకే ప్రమాదకర మందుల గుట్టు బయటపడిండా ? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే .

నటీనటుల నటన గురించి

సూపర్ స్టార్ కృష్ణ గారు వయసు సహకరించకపోయినా , తన శక్తంతా కూడదీసుకొని ఈ సినిమాలో నటించారు.కొన్ని సన్నివేశాల్లో ఆయన చెప్పిన డైలాగులు మళ్ళీ పాతరోజుల్ని గుర్తుకుతెస్తాయి.

అలాగే చాలా సన్నివేశాల్లో ఆయనకి వయసు అయిపోయింది అని స్పష్టంగా తెలిసివస్తుంది.దర్శకుడు కృష్ణ గారి బాడి లాంగ్వేజ్ మీద కాస్త శ్రద్ధ పెట్టాల్సింది.

ఇక విజయనిర్మల పాత్రకి తగ్గట్టుగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు.ఈ సినిమాలో అందరికన్నా ఎక్కువ నిడివి ఉన్న పాత్ర అంగనాది, ఆకట్టుకునే అవకాశం ఉన్నా, మెప్పించలేకపోయింది.

చిత్రంలో నటన పరంగా అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసేది సాయికుమార్.ఆయన నటన సన్నివేశాలకు జీవం పోసింది.

నరేష్ తన శైలికి భిన్నంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు.ఇక మురళీశర్మ విలనిజం, పోసాని కామెడి విలనిజం షరామామూలే

సాంకేతికవర్గం పనితీరు

ఈ.

ఎస్ .మూర్తి అందించిన సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేదు.నేపథ్య సంగీతం కూడా చాలా పేలవంగా ఉంది.సతీష్ ముత్యాల అందించిన సినిమాటోగ్రాఫి కొన్ని చోట్ల బాగుండి , మరికొన్ని చోట్ల తేలిపోతుంది.ఎడిటింగ్ పర్వాలేదు.ఇక దర్శకుడు ముప్పలనేని శివ ఈ సినిమాని ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అయ్యేలా తీయడంలో పూర్తిగా విఫలమయ్యారు.

థ్రిల్లర్ సినిమాలకు సహజంగా ఉండే స్క్రీన్ ప్లేతో పోల్చుకుంటే, శ్రీశ్రీ కథనం చాలా వీక్

విశ్లేషణ

కొన్నేళ్ళ క్రితం వచ్చిన ఒక మరాఠి సినిమాకి ఇది రీమేక్.కొన్నేళ్లుగా కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఇలాంటి కథలు తెలుగులో చాలా వచ్చాయి.

సీనియర్ డైరెక్టర్ అవడం వలన ట్రెండ్ ని అందుకోలేకపోయారో, అనుభవం కన్నా మించింది ఏమి లేదు అనే అతివిశ్వాసానికి పోయారో కాని, దర్శకుడు ముప్పలనేని శివ సరైన కథావస్తువుని ఎంచుకోలేదు.సూపర్ స్టార్ అనే ఇమేజ్ ఉన్న సీనియర్ కథానాయకుడు మళ్ళీ తెరపైకి వస్తుంటే భారి ఆశలే పెట్టుకుంటారు ప్రేక్షకులు.

అలాంటివారికి శ్రీశ్రీ లాంటి అతి సాధారణమైన కథ నచ్చకపోవచ్చు.కథ విషయాన్ని పక్కపెడితే, దర్శకుడి టేకింగ్ ఎప్పుడో పాతబడిపోయింది.

అతికించినట్టు ఉండే సన్నివేశాలు, సహజత్వం లేని నటనావిధానం, ఓ అరగంట తరువాత ఎలాంటి సీన్ వస్తుందో ప్రేక్షకుడు చెప్పగలిగే స్క్రీన్ ప్లే.ఇలా చెప్పుకుంటూపొతే శ్రీశ్రీ చిత్రంలో చాలా లూజ్ పాయింట్స్ ఉన్నాయి.

థ్రిల్లర్ సినిమాల ఓ నిమిషం కూడా ఎక్కడా అనిపించదు.ఇది పూర్తిగా దర్శకుడి వైఫల్యమే

కాస్టింగ్ కూడా సరిగా లేదు.

అందుకే ఏ ఒక్క పాత్ర కూడా సహజంగా అనిపించదు.ఆఖర్లో వచ్చే సుధీర్ బాబు ప్రత్యేక పాత్ర అవసరం ఏంటో కూడా అర్థం కాదు.

ఈ సినిమాని 2016లో ఎలా తీసారబ్బా అని కూర్చున్నంత సేపు ప్రేక్షకుడు ఆలోచించుకుంటూనే ఉండాలి.మొదట్లో ఓసారి, చివర్లో ఓసారి వచ్చే మహేష్ బాబు వాయిస్ ఓవర్ ప్రేక్షకుడికి కాస్త ఊరటనిచ్చే విషయం

హైలైట్స్ :

* సూపర్ స్టార్ కృష్ణ

డ్రాబ్యాక్స్ :

* కథ
* కాస్టింగ్
* స్క్రీన్ ప్లే
* సంగీతం

చివరగా :

కృష్ణ గారి టైంలో తీయాల్సిన సినిమా మహేష్ బాబు టైంలో తీసారు.

తెలుగుస్టాప్ రేటింగ్ : 1.5/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube