జై భీమ్‌ ‘సినతల్లి’కి ఇల్లు కొనిస్తానన్న ప్రముఖ దర్శకుడు.. ఏం జరిగిందంటే?

ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుని ప్రేక్షకుల ప్రశంసలను పొందిన సినిమాలలో జై భీమ్ ఒకటనే సంగతి తెలిసిందే.సూర్య హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఉంటే భారీస్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశం అయితే ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 Star Director Raghava Lawrence Promises A House For Jai Bhim Sina Talli Details-TeluguStop.com

ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం సొంతం చేసుకోవడం గమనార్హం.

ఈ సినిమాను చూసిన సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాకు సంబంధించిన తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఈ సినిమాలోని పాత్రలు హృదయాన్ని కదిలించేలా, మనస్సు చలించేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ సినిమాలోని రాజన్న, సినతల్లి పాత్రలకు ప్రేరణ రాజకన్ను, పార్వతి దంపతులు కాగా నటుడు, డైరెక్టర్ పార్వతి కష్టాలను చూసి చలించడంతో పాటు సొంతిల్లును నిర్మించి ఇస్తానని ఆమె వాగ్దానం చేశారు.

రాఘవ లారెన్స్ ట్విట్టర్ ద్వారా జై భీమ్ సినిమా చూడటంతో పాటు తాను చలించిపోయానని చెప్పుకొచ్చారు.

పార్వతి అమ్మ పడిన బాధల గురించి తన దృష్టికి వచ్చిందని సొంత డబ్బుతో ఆమెకు ఇల్లు నిర్మిస్తానని దర్శకుడు లారెన్స్ వెల్లడించారు.టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, మణికందన్, రజిషా విజయన్, లిజోమోల్ జోస్ కీలక పాత్రలలో నటించారు.

పార్వతికి ఇంటిని నిర్మించాలని రాఘవ లారెన్స్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.రాఘవ లారెన్స్ చేసిన ట్వీట్ కు 19,000కు పైగా లైక్స్ వచ్చాయి.రాఘవ లారెన్స్ సొంత డబ్బులతో ఇల్లు నిర్మిస్తానని చేసిన ప్రకటన గురించి పార్వతి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.జై భీమ్ సినిమా ప్రజల ఆలోచనా శైలిలో కూడా కీలక మార్పులను తీసుకొచ్చిందని తెలుస్తోంది.

తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా వల్ల సూర్యకు ఇతర భాషల్లో మంచి పేరు వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube