టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ జాబితాలో ఉన్నటువంటి వారిలో నటి శ్రీ లీల( Sreeleela )ఒకరు.ఈమె ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈమె నటించినది మూడు సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.తాజాగా బాలకృష్ణ ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకేక్కిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ సినిమాలో శ్రీ లీల విజ్జి పాప పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

ఈ సినిమా తర్వాత ఈమె తదుపరి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు త్వరలోనే మెగా హీరో వైష్ణవ్ సరసన నటించిన ఆదికేశవ ( Adi Kesava )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా నవంబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి శ్రీ లీలకు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎదురయింది.

ఈ సందర్భంగా శ్రీ లీలను ప్రశ్నిస్తూ మీరు కనుక లిప్ లాక్ ( Lip Lock )చేయాల్సి వస్తే మొదట ఏ హీరోతో ఎలాంటి సన్నివేశాలలో నటిస్తారు అంటూ ఈమెకు ప్రశ్న ఎదురైంది.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నేను ఏ హీరోతో కూడా లిప్ లాక్ సన్నివేశాలలో నటించను ఒకవేళ చేయాల్సి వస్తే అది కచ్చితంగా తన భర్తతోనే తనకే ఫస్ట్ లిప్ కిస్ ఇస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అయితే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు ఉండడం సాధారణం.కథ డిమాండ్ చేయడంతో తప్పనిసరి పరిస్థితులలో సెలబ్రిటీలు అందరూ కూడా ఇలాంటి సన్నివేశాలలో నటించడానికి సిద్ధమవుతున్నారు.