తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నందమూరి నట సింహం బాలకృష్ణ ( Balakrishna ) ఒకరు.తాజాగా బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి ( Bhagavanth kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదల ఆయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాలో ఆడపిల్లల గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ప్రతి ఒక్కరికి చేరువవుతున్నాయి ఇలా ఎంతో మంచి మెసేజ్ తో కూడినటువంటి ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) హీరోయిన్గా నటించగా శ్రీ లీల ( Sreeleela ) బాలయ్య కూతురి పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటి శ్రీలీలా ( Sreeleela )బాలకృష్ణను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీ లీల ఎన్నో రకాల ప్రశ్నలు అడగ్గా బాలయ్య వాటికి సమాధానాలు చెబుతూ వచ్చారు.మీరు నటించిన సినిమాలలో మీకు ఇష్టమైనటువంటి సినిమా ఏదని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు బాలయ్య సమాధానం చెబుతూ నా సినిమా ఒక్కొక్కటి ఒక్క విధంగా ఉంటాయి.సినిమాలు నచ్చే తాను చేశానని నచ్చేది నచ్చనది అంటూ ఏమీ లేదని తెలియజేశారు.

ఇక కొన్నిసార్లు మన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు బాగా ఆడుతుంది అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్న సినిమా సరిగా ఆడక ఫ్లాప్ అవుతుంది.అలాగే ఈ సినిమా పట్ల పెద్దగా అంచనాలు లేవు అనుకున్న సినిమా మాత్రం భారీ స్థాయిలో సక్సెస్ అవుతూ ఉంటాయని బాలకృష్ణ తెలిపారు.ఇక తన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి అలా ఫ్లాప్ అవ్వడానికి ముహూర్త బలం లేకపోవడమే కారణము అంటూ ఈ సందర్భంగా బాలయ్య సమాధానాలు చెప్పారు.బాలకృష్ణ ఇలాంటి ముహూర్త బలాలను ఎక్కువగా నమ్ముతారు అనే విషయం మనకు తెలిసిందే.
ఈయన ఏదైనా సినిమా ప్రారంభించాలి అన్న విడుదల కావాలి అన్న తప్పనిసరిగా మూహూర్త బలం చూసే విడుదల చేస్తుంటారు.ఇలా తన సినిమాలు ఫ్లాప్ అవడంతో ముహూర్త బలం సరిగా లేకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యాయని బాలయ్య వెల్లడించారు.







