అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై అభిమానులతో పాటు,ప్రేక్షకులు, అలాగే సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్ లు ఈ సినిమా పై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి.ఇది ఇలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు బరిలో దిగుతున్నాయి.
ఇటీవలే బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి దర్శక నిర్మాతలకు కాస్త ధైర్యం ఇచ్చింది.
దీనితో పుష్ప సినిమా కూడా భారీ రేంజ్ లోనే వసూళ్లను రాబడుతుంది అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా రేపు అనగా డిసెంబర్ 17న థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల కానుంది.అల్లు అర్జున్ కు, అలాగే ఈ చిత్ర యూనిట్ కి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున బెస్ట్ విషెస్ అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ సోనుసూద్ పుష్ప సినిమా పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బన్నీ బ్రదర్ పుష్ప సినిమా హిందీ వర్షన్ భారీ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆత్రుతగా ఉంది.
సక్సెస్ పార్టీ కోసం సిద్ధంగా ఉండు.అంటూ సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ ట్వీట్ పై బన్నీ స్పందిస్తూ.సోనూసూద్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం సోనూసూద్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.