శివకార్తికేయన్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ #SK20తెలుగు & తమిళంలో ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

వరుణ్ డాక్టర్ , కాలేజ్ డాన్ వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా, ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో #SK20 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

 Sivakarthikeyan Anudeep Kv Svcllp Suresh Productions Shanthi Talkies Sk20 Relea-TeluguStop.com

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాత ‘కాలేజ్ డాన్’ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంపై హీరో శివకార్తికేయన్ ని నిర్మాత సురేష్ బాబు అభినందించారు.అలాగే SK20విడుదల తేదీని కూడా ప్రకటించారు.“#SK20 చిత్రాన్ని వినాయక చవితి పర్వదినాన తెలుగు, తమిళంలో ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం.ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్‌లు త్వరలో వెల్లడిస్తాం’’అని తెలిపారు సురేష్‌బాబు.

ఈ సినిమా కథ భారతదేశంలోని పాండిచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంలో సాగుతుంది.ఈ చిత్రంలో మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

తారాగణం:

వకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.

సాంకేతిక విభాగం

రచన , దర్శకత్వం: అనుదీప్ కె.వి, సంగీతం: ఎస్ థమన్, నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు, బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్, సహ నిర్మాత: అరుణ్ విశ్వ పీఆర్వో : వంశీ-శేఖర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube