అమెరికాలో గడిచిన రెండు దశాబ్ధాలుగా సంఘ్ వారివార్‌తో అనుబంధం వున్న ఏడు హిందుత్వ గ్రూప్‌లు యాక్టీవ్‌గా వున్నట్లు South Asia Citizen Web నివేదికలో తేలింది.ఈ గ్రూపులు భారత్‌కు డబ్బు పంపడంతో పాటు వివిధ ప్రాజెక్ట్‌ల కోసం 158 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.1,227 కోట్లు) ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది.93 పేజీల ఈ నివేదికలో హిందుత్వ పౌర సమాజ సమూహాల ఆర్ధిక వ్యయాన్ని సంకలనం చేసింది.ఈ గ్రూప్‌లు భారత్‌లోని అనుబంధ సంస్థలకు డబ్బు పంపడమే కాకుండా.చరిత్రకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, అకడమిక్ అవుట్‌పుట్‌ల సందర్భంలో చట్టాలను ప్రభావితం చేయడానికి ఖర్చు చేసినట్లుగా తేలింది.మొత్తంగా తాజా పబ్లిక్ రికార్డుల ప్రకారం.దాదాపు 100 మిలియన్ డాలర్ల ఆస్తులను కలిగివున్న 24 యూఎస్ హిందూ జాతీయవాద సంస్థల కార్యకలాపాలను నివేదిక ప్రస్తావించింది.2001- 2019 మధ్య అందుబాటులో వున్న ట్యాక్స్ రిటర్న్‌ల ప్రకారం అమెరికాలోని ఏడు సంఘ్ పరివార్ అనుబంధ సంస్థలు తమ కార్యక్రమాల కోసం దాదాపు 159 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి.ఇందులో ఎక్కువ భాగం భారత్‌లోని పలు గ్రూపులకు పంపిందని నివేదిక పేర్కొంది.
ఈ సంస్థలను సేవా, ఏకల్ విద్యాలయ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఇండియా డెవలప్‌మెంట్ అండ్ రిలీఫ్ ఫండ్, పరమ శక్తి పీఠ్, పీవైపీ యోగ్ ఫౌండేషన్, విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా అండ్ సేవా ఇంటర్నేషనల్, ఆల్ ఇండియా మూవ్‌మెంట్‌గా గుర్తించారు.2001 నుంచి నమోదైన 158.9 మిలియన్ డాలర్ల వ్యయంలో దాదాపు 53 శాతం అంటే 85.5 మిలియన్ డాలర్లను 2014 -19 మధ్యకాలంలో కేవలం ఐదేళ్లలోనే ఈ సంస్థలు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది.







