తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ( Actor గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఇలా ఎన్నో రకాల పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శివాజీ.
దాదాపుగా రెండు దశాబ్దాల పాటు వరుసగా సినిమాలు చేసి నటుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.ఆ తర్వాత కాలంలో సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.
సినిమాలకు దూరమైన శివాజీ ఆ తర్వాత రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు.తరచూ రాజకీయాల ద్వారా సోషల్ మీడియాలో నిలుస్తూ వచ్చారు.
ఇకపోతే ఇటీవల తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి అడుగుపెట్టి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే.
గెలుస్తాడు అనుకున్న శివాజీ చివరికి మూడవ స్థానంలో నిలిచాడు.ఇటీవలే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు.ఇటీవలే విడుదలైన శివాజీ వెబ్ సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్( 90s Web Series ) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
కాగా త్వరలోనే శివాజీ వెండితెర మీదికి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట.అంతకంటే విశేషం ఏంటంటే అతను విలన్ పాత్రతో పునరాగమనం చేయబోతున్నాడు.ఈ విషయాన్ని తానే స్వయంగా కంఫార్మ్ చేశాడు.కాకపోతే ఏ సినిమాలో అన్నది మాత్రం చెప్పలేదు.
ఇక శివాజీ సన్నిహితుల సమాచారం ప్రకారం.అతను బోయపాటి చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నాడట.
బోయపాటి తన తర్వాతి చిత్రాన్ని తన ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణ( Hero Balakrishna )తో చేయబోతున్న సంగతి తెలిసిందే.ఇంతకుముందే ఒక టీవీ షోలో శివాజీ మాట్లాడుతూ.తాను బోయపాటి సినిమాలో నటించబోతున్నట్లు వెల్లడించాడు.ఇప్పుడేమో విలన్ పాత్ర గురించి అప్డేట్ ఇచ్చాడు.కాబట్టి బాలయ్య- బోయపాటి సినిమాలో శివాజీని ప్రతినాయకుడి పాత్రలో చూడవచ్చు అన్నమాట.మరి బాలయ్య, శివాజీ కాంబినేషన్ ఎలా ఉంటుందో స్క్రీన్ పై ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి.