విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ (Vijayawada Central Constituency) వైసీపీలో ఆసక్తికర పోరు కొనసాగుతోంది.నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే (Sitting MLA) మల్లాది విష్ణును కొత్త ఇంఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ కలిశారు.
ఇవాళ్టి నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టబోతున్న పాదయాత్రలో పాల్గొనాలని మల్లాది విష్ణును వెల్లంపల్లి ఆహ్వానించారు.అయితే పాదయాత్రకు రాలేనని మల్లాది విష్ణు తేల్చి చెప్పారని తెలుస్తోంది.
కాగా మల్లాది విష్ణు సహకరించడం లేదని వెల్లంపల్లి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు (Complaint) చేశారు.దీంతో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పార్టీ అధిష్టానం( Party High Command) చర్చలు జరపాలని నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే మల్లాది విష్ణుతో చర్చలు జరిపేందుకు వైసీపీ కోఆర్డినేటర్లు (YCP Co Ordinators) అయోధ్య రెడ్డి, మర్రి రాజశేఖర్ లను అధిష్టానం ఆదేశించింది.అయితే వైసీపీ పెద్దల బుజ్జగింపులు సఫలం అవుతాయా? లేదా ? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అయితే ఎన్నికలు రానున్న నేపథ్యంలో భారీ మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ అధిష్టానం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్ గా వెల్లంపల్లి శ్రీనివాస్ ను నియమించిన సంగతి తెలిసిందే.







