ప్రస్తుతం సమాజంలో చాల మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో హైబీపీ ఒక్కటి.
ఇది యుక్త వయస్సు పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు.అయితే యాపిల్ సైడర్ వెనిగర్ కి చాలా హెల్త్ బెనిఫిట్స్ చాల ఉన్నాయి.
ఇది హైబీపీ ని మ్యానేజ్ చేయడంలో చక్కగా పని చేస్తుంది.అయితే మీరు కూడా ఒకటి.
మీరు కూడా హైబీపీతో బాధపడుతున్నారా అయితే ఇది మీకోసమే.దీని ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దామా.
యాపిల్ సైడెర్ వెనిగర్‌ను వంటలు, బేకింగ్, సలాడ్స్ వంటి వాటిలో వాడతారు.ఇందులో యాసిడ్ ఎక్కువ కాబట్టి… దీన్ని డైరెక్టుగా తాగకూడదు.ఎక్కువగా వాడినా ప్రమాదమే.ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే… గ్లాస్ నీటిలో లేదా కప్పు టీలో… రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడెర్ వెనిగర్ వేసుకుంటే మంచిదే.
ఇది వాడడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది.కడుపులో మంట, అజీర్ణం వంటి లక్షణాలను తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది.

అంతేకాకుండా యాపిల్ సైడర్ వెనిగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారికి హైబీపీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువే.యాపిల్ సైడర్ వెనిగర్ టోటల్ కొలెస్ట్రాల్ నీ, ట్రైగ్లిసరైడ్స్ నీ తగ్గిస్తుంది.యాపిల్ సైడర్ వెనిగర్ లో పొటాషియం, మెగ్నీషియం వంటి ఎసెన్షియల్ మినరల్స్ ఉన్నాయి.హైబీపీ రావడానికి కల కారణాల్లో పొటాషియం, మెగ్నీషియం లెవెల్స్ తక్కువగా ఉండడం కూడా ఒకటి.పొటాషియం తగ్గితే బ్లడ్ లో సోడియం పెరుగుతుంది, తద్వారా బీపీ పెరుగుతుంది.
మెగ్నీషియం బ్లడ్ వెసెల్స్ ని రిలాక్స్ చేసి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ లో ఉంచుతుందని నిపుణులు తెలిపారు.