మొన్న సంక్రాంతికి విడుదల అయిన వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలు మంచి వసూళ్లను నమోదు చేస్తున్నాయి.ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అవ్వడంతో భారీ ఎత్తున ఓపెనింగ్స్ దక్కించుకున్నాయి.
ఇప్పటికే రెండు సినిమాలు కూడా వంద కోట్ల వసూళ్లను నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.ఇక ఈ రెండు సినిమాల యొక్క బ్రేక్ ఈవెన్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి వారం రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి యొక్క వాల్తేరు వీరయ్య సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.ఇక వీర సింహారెడ్డి సినిమా విషయానికి వస్తే కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది.
కానీ కచ్చితంగా వీర సింహారెడ్డి సినిమా కూడా బ్రేక్ ఈవెన్ ను సాధించడం ఖాయం అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
ఈ రెండు సినిమాలకు మరో వారం రోజుల పాటు మంచి కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉంది.కనుక రెండు సినిమాలు కూడా సరికొత్త బెంచ్ మార్క్ లను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఏ ఒక్క మెగా హీరోకు సాధ్యం కానీ భారీ ఓపెనింగ్స్ కలెక్షన్స్ ను వాల్తేరు వీరయ్య సినిమా తో చిరంజీవి దక్కించుకున్న విషయం తెల్సిందే.
ఇక వీర సింహారెడ్డి సినిమా తో కూడా బాలయ్య తన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను దక్కించుకోబోతున్నాడు.ఇప్పటికే అఖండకు ఏమాత్రం తగ్గకుండా వీర సింహారెడ్డి సినిమా ఓపెనింగ్స్ లభించాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మరియు నందమూరి ఫ్యాన్స్ ప్రకటించారు.
లాంగ్ రన్ లో కాస్త ప్రభావం చూపిస్తే కచ్చితంగా వీర సింహారెడ్డి సినిమా బ్రేక్ ఈవెన్ ప్రాజెక్ట్ అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.