Allari Naresh: నరేష్ కు మైనస్ పాయింట్ అదేనా.. అందువల్లే సినిమాలు ఫ్లాపవుతున్నాయా?

అల్లరి సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన అల్లరి నరేష్ సుడిగాడు సినిమా వరకు తను హీరోగా తెరకెక్కిన సినిమాలలో దాదాపుగా ప్రతి సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ కు సూట్ అయ్యే కథలతో సినిమాలను తెరకెక్కించే విషయంలో దర్శకనిర్మాతలు ఫెయిల్ అవుతున్నారు.

 Reasons Behind Allari Naresh Movies Flop Result Details, Allari Naresh, Emandi R-TeluguStop.com

అల్లరి నరేష్ కు మైనస్ పాయింట్ ఆయన కథల ఎంపికేనని విశ్లేషకులు చెబుతున్నారు.

సరైన కథలను ఎంచుకోకపోవడం వల్లే అల్లరి నరేష్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడుతూ అల్లరి నరేష్ సినిమాలు ఫ్లాప్ కావడం వెనుక అసలు కారణాలను చెప్పుకొచ్చారు.ఆయన చెప్పిన విషయాల ప్రకారం రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్న అల్లరి నరేష్ కు తండ్రి చనిపోవడం కూడా మైనస్ అయింది.

అల్లరి నరేష్ ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

Telugu Allari Naresh, Emandi Ramarao, Itlumaredumilli, Sudigadu-Movie

సీరియస్ రోల్స్ లో కూడా అద్భుతంగా నటించే అల్లరి నరేష్ కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్ల సినిమాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.నరేష్ కు ఉన్న అభిమానుల సంఖ్య తక్కువేం కాదు.కొత్త తరహా దర్శకులకు నరేష్ ఛాన్స్ ఇవ్వాలని మరి కొందరు చెబుతున్నారు.

Telugu Allari Naresh, Emandi Ramarao, Itlumaredumilli, Sudigadu-Movie

క్రిటిక్స్ తో పాటు ఫ్యాన్స్ ను మెప్పించే కథలకు అల్లరి నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.ప్రేక్షకుల ఆలోచనా ధోరణికి అనుగుణంగా నరేష్ కథలను మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.కామెడీ సినిమాలకు నరేష్ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని అభిమానులు సూచనలు చేస్తుండటం గమనార్హం.

అల్లరి నరేష్ కెరీర్ విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube