తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు చేరికలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి.దీనికి తగ్గట్లుగానే వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నాయకులు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఏ పార్టీలోకి వెళ్తే తమ రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.తెలంగాణలో అధికారంలోకి ఏ పార్టీ రాబోతోంది ? అనే ముందస్తు అంచనాలు వేసుకుని మరి మండల, నియోజకవర్గ, రాష్ట్రస్థాయి నేతలు పెద్ద ఎత్తున పార్టీలు మారుతున్నారు.ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి.రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులను చేర్చుకున్నారు.
అయితే అలా చేర్చుకున్న నాయకుల్లో చాలామందికి ఏ పదవులు దక్కకపోగా, సరైన రాజకీయ ప్రాధాన్యం దక్కకపోవడం పై తీవ్ర అసంతృప్తితో వారంతా ఉన్నారు.ఈ క్రమంలోనే టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు మొదలయ్యాయి.
అయితే తెలంగాణలో టిఆర్ఎస్ తర్వాత బిజెపి బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.ఇటీవల కాలంలో బిజెపి బాగా స్పీడ్ పెంచడంతో పాటు, బిజెపి జాతీయ పెద్దలు పదేపదే తెలంగాణలో అడుగు పెడుతూ, బీజేపీ ని బలోపేతం చేసే విషయం పైనే దృష్టి సారించారు.
అయినా వలస నేతల చూపు కాంగ్రెస్ పైనే ఉంది.ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి నాయకులు కాంగ్రెస్ లో చేరారు.
టిఆర్ఎస్ లో జడ్పీ చైర్మన్ , కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇలా చాలామందే కాంగ్రెస్ లో చేరారు.

దీంతో తెలంగాణలో బిజెపి బలపడిందనే ప్రచారం పై పైనే అని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని మెజారిటీ టీఆర్ఎస్ నాయకులు , కొంతమంది బీజేపీ నాయకులు బలంగా నమ్ముతుండడంతోనే కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై అందరికీ ఉన్న నమ్మకం, ఖచ్చితంగా కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురాగలము అనే నమ్మకం ఎక్కువమంది నాయకుల్లో ఉండడంతోనే వలసలు ఊపందుకున్నట్టు గా అర్ధం అవుతోంది.ప్రస్తుతం వలసల వ్యవహారంతో అధికార పార్టీ టిఆర్ఎస్, తెలంగాణలో అధికారంలోకి వస్తాము అనే ధీమాతో ఉన్న బిజెపి కి ఆందోళన కలిగిస్తున్నాయి.