మాస్ మహారాజ రవితేజ వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుని మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడు.ఇక ప్రస్తుతం రవితేజ మరో సినిమాతో దసరా బరిలో నిలవబోతున్నాడు.”టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao )” అనే పాన్ ఇండియన్ సినిమాతో దసరాకు రాబోతున్నాడు.ఈ సీజన్ లో భారీ పోటీ ఉన్నపటికీ వెనకడుగు వేయడం లేదు.
ఈ సినిమాపై టీమ్ అంతా ధీమాగా ఉంది.బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం అంటూ ముందు నుండి ఈ సినిమా విషయంలో నిర్మాత సైతం కాన్ఫిడెంట్ గా ఉన్నారు.నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమా నుండి రెండు రోజుల క్రితం ట్రైలర్ ను చూపించేసారు.
ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా అయ్యారు.
మాస్ రాజా కూడా వరుస ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.తాజాగా రవితేజ( Ravi Teja )కు అరుదైన ఘనత లభించింది.
ఈయన ఒక వరల్డ్ కప్ మ్యాచ్ కు కాసేపు కామెంటరీ చెప్పారు.కామెంటరీ బాక్స్ లో ఇతర వ్యాఖ్యలతో ఫ్యాన్స్ కు కొద్దిసేపు తనదైన హుషారుతో వినోదం పంచారు.ఇదే క్రమంలో ఈయన క్రికెటర్ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే సిరాజ్ బయోపిక్( Mohammed Siraj ) లో నటిస్తాను.అలాగే కోహ్లీ కూడా చాలా ఇష్టం.
ఆయన యాటిట్యూడ్, దూకుడు, ఆయన బ్యాట్ ను హ్యాండిల్ చేసే విధానం బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.