యానిమల్ అన్ని వందల కోట్లు వసూళ్లు చేసిందా.. వంగ మ్యాజిక్ భలే పనిచేస్తుందిగా!

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ సినీ ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన ”యానిమల్”( Animal ) సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన విషయం విదితమే.భారీ స్థాయిలో పాన్ ఇండియన్ వ్యాప్తంగా రిలీజ్ అవ్వగా ఫస్ట్ షో నుండే పాజిటివ్ బజ్ తెచ్చుకుంది.

 Ranbir Kapoor's Animal Box Office Collection Day 7, Animal Collections, Tollyw-TeluguStop.com

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో తెరకెక్కడంతో ఈ సినిమాపై మన తెలుగు ప్రేక్షకులు నుండి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది.ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటించారు.ఈ జంట నటనలో జీవించారు అనే చెప్పాలి.ఈ సినిమా జనాల్లో మంచి ఇంప్రెషన్ రాగా చిన్న వారి నుండి పెద్ద వారి వరకు మంచి ఆసక్తి చూపిస్తున్నారు.

అందుకే కలెక్షన్స్ కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి.మరి ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి 7 రోజులు అవుతుండగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం…

ఈ సినిమా మొదటి రోజు 63 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేయగా రెండవ రోజు ఏకంగా 70 కోట్లు వసూళ్లను రాబట్టింది.ఇలా ఇప్పటి వరకు 338 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందట.మొత్తం మీద లాంగ్ రన్ లో ఈ మూవీ మరిన్ని కలెక్షన్స్ వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ గా దూసుకుపోయే అవకాశం ఉంది.కాగా ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందించగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube