యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన ఏడేళ్ల తర్వాత రామ్ చరణ్( Ram Charan ) హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు.పాతికేళ్ల సినీ కెరీర్ లో జూనియర్ ఎన్టీఆర్ 29 సినిమాలలో నటించగా రామ్ చరణ్ 14 సినిమాలలో నటించారు.
ఎన్టీఆర్ 30వ సినిమాగా దేవర( Devara ) తెరకెక్కుతుండగా రామ్ చరణ్ 15వ సినిమాగా గేమ్ ఛేంజర్( Game Changer ) తెరకెక్కుతోంది.ఆర్.ఆర్.ఆర్ సినిమాతో అటు ఎన్టీఆర్ కు ఇటు రామ్ చరణ్ కు బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది.
కొన్నేళ్ల క్రితం తుఫాన్ (జంజీర్) అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో చరణ్ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.అయితే చరణ్, తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఇతర సౌత్ భాషలతో పాటు తప్పనిసరిగా హిందీలో సైతం రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.
దేవర, గేమ్ ఛేంజర్ సినిమాల హిందీ రైట్స్ అమ్ముడవగా దేవర సినిమా హిందీ రైట్స్ 50 కోట్ల రూపాయలకు అమ్ముడైతే గేమ్ ఛేంజర్ హిందీ రైట్స్ మాత్రం 75 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.ఇద్దరు హీరోల క్రేజ్ సమానమైనా కొరటాల శివ( Koratala Siva ) గత సినిమా ఫ్లాప్ కావడం వల్ల దేవర రైట్స్ ఒకింత తక్కువ మొత్తానికే అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.దేవర, గేమ్ ఛేంజర్ ఫలితాల ఆధారంగా తర్వాత సినిమాల రైట్స్ అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది.
సౌత్ సినిమాల హక్కులకు బాలీవుడ్ ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో భారీ మొత్తం ఇచ్చి హక్కులు కొనుగోలు చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.ఎన్టీఆర్, చరణ్ వరుస విజయాలను అందుకుని క్రేజ్ పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రామ్ చరణ్, ఎన్టీఆర్ క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్నారు.